రెండు ప్రార్థనల పోలిక (లూకా 18:10-14)

1. పరిసయ్యుని ప్రార్థన:- గర్వమును, స్వనీతియును గల హృదయమునుండి వచ్చిన ప్రార్థన. ( లూకా 18:11-12 )  సామె 8:13.

నీతి అనగా 3 నీతులున్నవి –

1) సునీతి

2) స్వనీతి

3) దుర్నీతి

ఈ పరిసయ్యుని స్వనీతి -

1) తన మంచి ప్రవర్తననుగూర్చి ఇతరులవలెకాదు (లూకా 18:11, సామె 12:15. రోమా 3:23 చదవండి).

2) పరిసయ్యుని ఆత్మీయ విషయము: ఉపవాసము (లూకా 18:12, యెషయ 65:5)

3) తన మంచి పనులను గురించి దశమ భాగము, 12వ వచనము ( లూకా 17:10 ) ఇతరులను తృణీకరించెను. 11, 12 వచనములు.

 4) ప్రార్థనాంశములులేని ప్రార్థన: తనకు తానే తృప్తి చెందెను. 11 వచనము ( ప్రకట 3:17, యోహా 9:39-41, ఎఫెసి 1:17-19, హోషయ్య 12:8; జెకర్యా 14:5,

 5) ప్రార్థన అంగీకరింపబడలేదు. గర్వమువలన. గనుక తగ్గింపబడవలెను. 14వ వచనము) యోబు 35:13, సామె 115:29, యెష 59:2)

 2. సుంకరి ప్రార్థన:- వినయముగల హృదయమునుండి వచ్చిన ప్రార్థన (లూకా 18:13, యెష 57:15) 1) తన నిజమైన స్థితి తెలిసికొనెను. 13వ వచనము) II దిన 7:14) 2) దైవ సన్నిధికి వచ్చుటకు తగనివాడనని, తగ్గించుకొనెను. కన్నులెత్తుటకు ధైర్యములేక (13 వచనము, నెహెమ్యా 1:4) 3) శిక్షకు అర్హుడనని భావించుకొనెను. రొమ్ము కొట్టుకొనెను. [13 వచనము లూకా 23:40-41]

 4) ఇతరులకు తీర్పుతీర్చక తానే దోషినని తీర్పు చేసుకొనెను. 13 వచనము, 1 తిమో 1:15) నేను ప్రధానుడను.

 5) తనకున్న గొప్ప ప్రార్థనాంశము. (13వ) లూకా 23:42)

 6) తన ప్రార్థన అంగీకరింపబడి, నీతిమంతుడుగా తీర్చబడెను. (14వ) (కీర్త 145:18, లూకా 1:52) గనుక హెచ్చింపబడెను పెండ్లికుమార్తె సంఘముగా తయారగువారు అన్ని విషయములలో తగ్గించుకొని దైవ సన్నిధిలో ఎక్కువగా కనిపెట్టి పైకి మేఘమెక్కవలెను. దైవ శక్తి చదువరులకు దయచేయునుగాక.