రెండు ద్వారములు, మత్తయి 6:33 - (యం. దేవదాసు అయ్యగారి ఉపదేశము.) తేది 12 — 10 — 1958


రెండు ద్వారములబడి దేవుని రాజ్యములోనికి, దేవుని సంఘము లోనికి రావలసినవారికి ఈ వాక్యమందు వర్తమానమున్నది.

మన దేవాలయమునకున్నది ఒక ద్వారము. ఇక్కడ నిండి పోయినందువల్ల ఒక్కొక్క ఆదివారము వెనుక ద్వారము గుండా వచ్చి ఇక్కడ కూర్చుని వింటారు. వారుకూడా ఆరాధనలో పాల్గొంటారు.

ఈ వాక్యమును విడదీసికొందాము. అందులో రెండు గొప్ప మాటలు ఉన్నాయి.

(1) దేవుని రాజ్యము

(2) ఆయన యొక్క నీతి

దేవునియొక్క రాజ్యముగా దేవునియొక్క గవర్నమెంటు. ఈ గవర్నమెంటుకు ఆయనే రాజు. అయితే దేవుని రాజ్యమెక్కడ ఉన్నది ? మన హిందూ దేశము నేలే గవర్నమెంటు. రాజ్యము ఢిల్లీలో ఉన్నది. వారి రాజ్య ప్రవేశము హిమాలయమునుండి కన్యాకుమారి వరకు ఉన్నది. అలాగుననే దేవుని రాజ్యముకూడా నున్నది. ఇంగ్లండు దేశము వారికి వారి దేశమే వారి రాజ్యము. వారు ఇతర దేశములు కూడా గెలుచుకుంటే అది కూడా వారి రాజ్యమే. అలాగే జపాను వారున్నది జపాన్ రాజ్యము వారెక్కడైనా గెలుచుకుంటే అది వారి రాజ్యమే. అలాగుననే దేవునిరాజ్య మెక్కడ నున్నది ? అనేది ఒక గొప్ప ప్రశ్న.

ప్రభువు 1. ఆయన రాజ్యమును వెదకమన్నారు. రాజ్య మెక్కడనున్నదో తెలియకపోతే ఎలాగు? ఎక్కడున్నదో చెప్పే వెనుకనున్నారు. మత్తయి 6 అధ్యాయములో చివర రాజ్యమును గురించి చెప్పాడు. గాని అసలు 5వ అధ్యాయము లోనే ఎత్తుకున్నాడు. ధన్యత వాక్యములోనే చెప్పాడు. "దీనమనస్సు గలవారు ధన్యులు.  దేవుని రాజ్యము వారిది"కాబట్టి పరలోకంలో ఉన్నది. మనం భూలోకములో ఉన్నాము. ఆ రాజ్యము పరలోకంలో ఉంది, ఆయన వెదకమన్నాడు. ఎటు? ఎగిరి వెళ్ళాలా? ఆ రాజ్యంలో ఎవరుంటారో మత్తయి 5 : 1 - 10 వరకు ఉన్నది. ఆ పరలోక రాజ్యములో ఉండవలసిన మెంబర్లు 5వ అధ్యాయములో ఉన్నారు.

చిత్రంలో ఉన్న తెలుగు పాఠాన్ని యథాతథంగా కింద ఇవ్వడం జరిగింది:

 1. దీనమనస్సు గలవారు

 2. సాత్వికులు

 3. దుఃఖపడువారు (ఆత్మ సంబంధ దుఃఖం)

 4. శుద్ధ హృదయులు

 5. కనికరము కలవారు, దేవునిరాజ్య వాస్తవ్యులు.

గనుక పరలోకరాజ్య మెంబర్లు వీరే. ఇంకా ఎవరంటే యేసు ప్రభువు నామము ధరించి శ్రమల పాలయ్యే వారందరు మెంబర్లే. ఆరాజ్య మెంబర్లేగాని ప్రస్తుతం వారు మెంబరీగా ఇక్కడ ఉన్నారు. శాశ్వతంగా అక్కడ ఉంటాము.

మనంగూడా ప్రభువు పిలుచునప్పుడు అక్కడికి వెళతాము. ప్రస్తుతం ఇక్కడ ఉన్నాము. వారసత్వము కోసరము ఇక్కడ తయారగుచున్నాము.

ప్రశ్న : గుడిలో మన అందరము ఉన్నాము. పాపాత్ములమా? పరిశుద్ధులమా? ఏమాత్రము పాపులముకాము. పాపపుటొప్పదలలో "మీ పాపములు నేను జ్ఞాపకం చేసికొనను" అని ఉన్నది. అంటే క్షమించి వేసినాడన్నమాట. ఎఫెసీ 1 : 1 పౌలు ఎఫెసీ పట్టణములో నున్న క్రైస్తవులకు పత్రిక వ్రాయుచూ ఎఫెసులో ఉన్న క్రైస్తవులకు అని వ్రాయలేదు. పరిశుద్ధులకు అని ఉన్నది. గనుక వారందరు పరిశుద్ధులే. పరిశుద్ధులు దేవుని రాజ్యములో మెంబర్లు. మీకంటే ముందు వెళ్ళినవారు పరిశుద్ధులు కారా? పాపంలో పడిపోతూ లేస్తూ, క్షమాపణ పొందుతూ నడుస్తూ రాజ్యంకొరకు నిరీక్షిస్తూ ఉన్న మనం మాత్రం పరిశుద్ధులంకామా? గనుక వారు పరిశుద్ధులే మనం పరిశుద్ధులమే. నమ్మే వారందరు పరిశుద్ధులే. అక్కడ వారికికున్న రాజ్యము ఇక్కడ మనకు కూడా ఉన్నది. ఈ రాజ్యానికి ఒక క్రొత్త పేరున్నది సంఘము అని ఉన్నది. గనుక ఈరాజ్యమైనా ఆరాజ్యమే ఆరాజ్యమైనా ఈరాజ్యమే. దేవుని రాజ్యము వెదకమన్నాడు గనుక ఆరాజ్య కథ ఇది. మొదటికథ.

బ్రతికిఉన్న మనము అక్కడికి ఎగిరి వెళ్ళలేము గనుక ఆరాజ్యం ఇక్కడున్నది. ఈ దైవ రాజ్యానికి (సంఘానికి) వెలుపట పిశాచిరాజ్యమున్నది. ఆరాజ్యములో ఉన్నవారికి దేవుని రాజ్య సభ్యులు వెళ్ళి బోధ చేస్తున్నారు. చెపుతున్నారు. గనుక నమ్మి రావలెను. దేవునికి స్తోత్రము — వారికి ద్వారం తెరువబడినది. గనుక వస్తున్నారు.

రెండు ద్వారాలు మన ఎదుట ఉన్నవి.

మొదటి ద్వారము దానిగుండా బాప్తిస్మము పొంది వస్తున్నారు. వారిపేరు రిజిష్టరు అవుతుంది. ఈద్వారంద్వారా వచ్చారు గనుక నిత్యరాజ్యానికి తప్పక వెళ్తారు. స్థిరంగా ఉంటే. ఈరాజ్యంలోకి వచ్చినవారు వెలుపటి సంఘములోనికి వెళ్ళాలంటే వారు చేర్చుకోరు. వెలుపట సంఘంలో చేరాలంటే బాప్తిస్మము కొట్టివేసి రమ్మంటారు.

దేవుని రాజ్యం, దేవుని సంఘం, దేవుని గుడి ఇవి మూడు ఒక్కటే స్థలాలు వేరుగాని. అయితే అందరు బాప్తిస్మము పొంది ఇందులోకి వచ్చేయాలంటే వారి బంధువులందరు ఆటంకపరుస్తున్నారు. అక్కడే ఉండి వారు ఈ రాజ్యముకొరకు నిరీక్షిస్తున్నారు. శరీరంద్వారా బాప్తిస్మము పొందలేదు గాని వారి హృదయములో సంఘము, రాజ్యము, గుడి ఉన్నది. హృదయములో నున్నట్లు లోకమునకు తెలియదు, గనుక వీరు ఈ ద్వారం అనగా వెనుక ద్వారం గుండా వచ్చినవారని అన్నానే వారు వీరే. ఈ ఆరాధనలో పాలు పొందుచున్నారు. ఈ బంధువులయినా ఆటంకపరుస్తారంటే బాప్తిస్మం పొందలేదు గదా పోనీలే అని అనుకుంటున్నారు. బాప్తిస్మము వారికి చాలా ఆటంకముగా నున్నది.

వెనుక ద్వారంగుండా వచ్చినవారిని బంధువులేమి అనరు. బైబిలు చదివినా, ప్రార్థన చేసికొన్నా ఏమి అనరు. కాని బాప్తిస్మము పొందుట అనగానే వల్లపడదు.

 1. ద్వారం వారు - బాప్తిస్మం ద్వారా

 2. వెనుక ద్వారం వారు - విశ్వాసం ద్వారా

ఒకటవ ద్వారంగుండా వచ్చినవారికి బాప్తిస్మము, విశ్వాసము ఉంది. రెండవ ద్వారంగుండా వచ్చినవారికి విశ్వాసముందిగాని బాప్తిస్మము లేదు. బాప్తిస్మము పొందాలని అని ఆశఉన్నది. ఈ రెండు ద్వారములలో ఏద్వారంగుండా వచ్చినవారు పరలోకరాజ్య మెంబర్లు? వీరికి, వారికి మరణం వచ్చింది. చివరి సమయంలో యేసు ప్రభువు ఇద్దరి దగ్గరకు వచ్చి ఒకరితో బాప్తిస్మము పొంది వచ్చావు గనుక ఈరాజ్య మెంబరువే అని రెండవ వానిని మెంబరువుకావు అని అంటే న్యాయమా ? మనకు ఇష్టముండునా ?

ఈ గొప్ప ప్రశ్న ప్రపంచమంతటిలో ఒక బంతిలాగా ఊగిస లాడుతుంది. ఆ అనుమానం పోగొట్టుటకు ఒక పేపరువేసి పంచి పెట్టారు. బాప్తిస్మము గురించి మాత్రమే వ్రాశారు.

యేసు ప్రభువువచ్చి వీనిని పరలోకమునకు తీసికొని వెళ్తుంటే రెండవవారు మేమంతా శ్రమపడ్డాము, విశ్వాసముంచాము అని గోల్లున ఏడుస్తారా? లేదా? ఈ వెనుక ద్వారం గుండా వచ్చినవారు విశ్వాసముద్వారా గుడికి వస్తున్నాము, సన్నిధి కూటములు పెట్టుకుంటున్నాము, యేసు ప్రభువు కనబడుచున్నారు, మాట్లాడుచున్నారు. గాని వారిని తీసికొని వెళ్తున్నాడు, మమ్ములను తీసికొని పోవుటలేదు అని అనుకుంటారు. యేసుప్రభువు వారిని తీసికొని వెళ్ళక పోవుట న్యాయమా? ఈ ప్రశ్నకు ఎవరు జవాబు చెప్ప లేదు. కొంత మంది భక్తులకు, విశ్వాసులకు వీరిని పరలోక రాజ్యమునకు తీసికొని వెళ్తాడని తెలిసికూడా భయపడి ఊరుకొంటున్నారు. ఒక మిషనరీ భార్య "బ్రదర్ వారికి కూడా రక్షణ ఉంది" అని అన్నది. ఈ ప్రశ్నకు జవాబు మాత్రం నాకు తెలిసినంతవరకు బహు విధముగా త్వరలో వ్రాసి అచ్చు వేయించవలసినది ఉంది. వారిని వీరిని చేర్చుకుంటాడు.

బాప్తిస్మము తీసుకొనుట ముందు విశ్వాసముంచుట ఉందా? మీరు బాప్తిస్మము పొందండి, నమ్మండి. తర్వాత మీకు రక్షణ అని మార్కులో

2. ముద్ర అనగా బాప్తిస్మము పొందండి అప్పుడు మీకు రక్షణ అని ఉన్నది. గనుక వాక్యానుసారముగా మొదటిద్వారమే మొదటిది రెండవ ద్వారం గుండా వచ్చినవారికి విశ్వాసమే ఉన్నది. ఉద్యోగం కొరకు బాప్తిస్మము పొందాడు గాని విశ్వాసం లేదు, అయితే ప్రభువుకు తెలుసు. విశ్వాసము లేకుండా బాప్తిస్మము పొందినవారు నరకానికి వెళ్తారా? లేక మోక్షమునకు వెళ్తారా? గనుక ఇప్పటికి ఆయన రాజ్యమును, నీతిని వెదకండి అని ఉన్నది. అయితే బాప్తిస్మము వట్టిదా ? అంటారు అలాగయితే విశ్వాసం వట్టిదే అనాలి. రెండూ ఉండాలి. బాప్తిస్మము పొందాలని ఉంది పొందాలి. వారికి బహిరంగ బాప్తిస్మము వీరికి అంతరంగ బాప్తిస్మము ప్రభువే ఇస్తారు.

మన సంఘములలో ప్రభు భోజనము ఉంది. అయితే ప్రభువు సన్నిధి కూటములో అంతరంగముగా ఇస్తున్నారు. భూలోకములో 2000 సంఘాలకు ఈసంగతి క్రొత్తదే. ప్రభువు స్వయముగా సంస్కారము ఇస్తున్నారని విని పాదరులందరు 'ఇంకా ఎందుకు' అని ఎగతాళి చేశారు. కొన్ని సంవత్సరాల క్రిందట ఏప్రిల్ 4వ తారీకున అయ్యగార్ని సంఘము బల్ల యొద్దకు రానీయకపోగా అక్కడే కూర్చుని యుండగా ప్రభువే స్వయముగావచ్చి ఇచ్చారు. అది విని ఈయన అబద్ధప్రవక్త అన్నారు. ఇప్పుడు సన్నిధి కూటములందరు తీసికొంటున్నారు. ఏమంటారు ? విశ్వాసము ముందు తర్వాత బాప్తిస్మము తర్వాత రక్షణ. బాప్తిస్మము పొందాలనే రూలు ఉంది. వెనుకనుండి వచ్చిన వీరిని చేర్చుకొనుట దానికి వ్యతిరేకమే గాని ప్రభువు చిత్తము. మనం సంతోషించాలి. అయ్యో నేను బాప్తిస్మము పొందాను నా అన్న పొందలేదు, ఎందుకు చేర్చుకుంటారు అని తమ్ముడు అనగలడా ?

నేను చెప్పిన ఈమాటలు ఎంతవరకు నిజమో పరీక్షించుటకు ప్రార్థనలోపెట్టి దేవుని అడగండి. సందేహం ఉన్న వారు ప్రార్థన చేయండి. నమ్మి బాప్తిస్మము పొందినవారు రక్షింపబడుదురు.

Popular Posts