Skip to main content

Posts

Showing posts from July, 2026

స్థిర విశ్వాస విద్య

ఒక అంశమును గూర్చి పూర్తిగా ప్రార్థన చేసిన తరువాత అది నెరవేరును , అనగా దేవుని కృపలో నెరవేరియుండును. ఆ నెరవేర్పు మనకు కనిపించే వరకు స్తుతి చేయవలెను. ప్రార్థనలో ఎంత పట్టుదల ఉండునో , ఆసక్తిలో అంతే పట్టు ఉండవలెను. ఇవి రెండూ కలిసి స్తుతిలో ఉండవలెను. అప్పుడు నెరవేర్పు ఉండవలెను. దీనికే స్థిరమైన విశ్వాసమని పేరు. జంకు ఉండకూడదు. నెరవేరకపోవడమునకు గల ఆటంకములు , గురుతులు , నీడలు కనిపించునప్పుడు మరింత ఎక్కువ నమ్మవలెను , ఎక్కువ స్తుతింపవలెను. ప్రార్థన మాత్రము ఒక్కసారితో ముగింపవలెను. అయితే నెరవేర్పు అగువరకు స్తుతి చేయుచుండవలెను. విశ్వాస ప్రమాణము 1. అనాదియు అనంతముగల దేవుడు , అనాది కాలమునందే నన్ను రక్షించవలెనని తలంచినాడని నేను నమ్ముచున్నాను. 2. ఆయన ఎట్టివాడో నరుడుకూడా అట్టివాడై యుండవలెనని , తన దివ్య లక్షణములతో ఆయన నరులను పరిశుద్ధ వంతులనుగా కలుగజేసెనని నేను నమ్ముచున్నాను. 3. మనుష్యులను కాపాడే సహాయకులు అవసరమని ; ఆదిని దేవదూతలను ప్రకాశమాన వ్యక్తులుగాను , ఆత్మ స్వరూపులుగాను కలుగజేసెనని నేను నమ్ముచున్నాను. 4. మనుష్యులు పుట్టకముందే వారికి కావలసిన గాలి , వెలుగు , నీరు , ఆహార వృక్షాదులు మొదలయినవి కలుగజ...

విశ్వాసాభివృద్ధి

1. వాగ్దానములు: బైబిలునందు దేవుడు వ్రాయించిన వాగ్దానములు , అనగా రోగులకు తగినవి చదువుకొనవలెను. వాక్యమునందు a) పాపులకు తగినవి , b) బీదలకు తగినవి , c) అవిశ్వాసులకు తగినవి , d) భయకంపితులకు తగినవి , e) ఎట్టి అక్కరలోనున్న వారికైనను తగిన వాగ్ధానములు గలవు. (మత్తయి 5,6,7 అధ్యా॥లు ; యోహాను 14:14; హెబ్రీ. 12 వ అధ్యాయము ; కీర్తన 25 వ అధ్యాయము ; యెహోషువా 1 వ అధ్యాయము) మొదలగు వాగ్దానములు చదువుటవలన విశ్వాసము వృద్ధియగును. (ఇది సుళువు మార్గము). 2. బైబిలు: బైబిలులో నీ ఇష్టము వచ్చిన అధ్యాయములు , విశ్వాసము పెరుగువరకు చదువుము. జార్జిముల్లరు దొరగారు విశ్వాసములో ప్రసిద్ధి కెక్కినారు. తనకు విశ్వాసము మందగిలినప్పుడు ఆయన ఈ పద్ధతినే అవలంభించిరి. 3. స్తుతి: విశ్వాసమున్న యెడల స్తుతి బాగుగా వచ్చును. కొన్ని సమయములలో విశ్వాసము ఉండదు గనుక స్తుతి రాదు. అయినను బలవంతముగా స్తుతి మాటలు పలుకవలెను. అదివరకే స్తుతిమాటలు వచ్చియుండును గదా! స్తుతిమాటలు: స్తోత్రము , స్తుతి , వందనము , నమస్కారములు , నుతులు , కీర్తి , మహిమ , మంగళ స్తోత్రార్పణలు , వినుతులు , ప్రణుతి మొదలైనవి. ఇది చాల కష్టమైన పద్ధతి. అయినను చేయవలెను. 4. ఆత్మ , స్...

విశ్వాస జీవనము (మార్కు 11:24)

1. విశ్వాసమునకు గుడ్డితనమని చెప్పవచ్చును లేక పేరుపెట్టవచ్చును. లేనివి ఉన్నవనియు , ఉన్నవి లేనివనియు నమ్ముటయే విశ్వాసము. హెబ్రీ. 11 వ అధ్యాయములో ఉన్నట్లు విశ్వాసపు కన్ను అని కూడా దీనికి పేరు. 2. రానివి వచ్చుననియు , వచ్చునవి రావనియు నమ్ముటయే విశ్వాసము. 3. నేత్రములు - నాలుగు 1) ఆత్మ నేత్రము 2) మనో నేత్రము 3) విశ్వాస నేత్రము 4) శరీర నేత్రము శరీర నేత్రము:- భూలోకమును , మేఘములను , నక్షత్రములను , సూర్య చంద్రాదులను ఈ నేత్రము చూడగలదు. మొత్తముమీద శరర నేత్రము కొంతమట్టుకే చూడ గలదు. అంతా చూసేది అది వేరు. అది ఆత్మనేత్రము. ఇది మాంస నేత్రము గనుక మహిమను చూడలేదు. శరీర నేత్రము గనుక సర్వమును చూడలేదు. ఈ నేత్రము తరచుగా పాపము తట్టు నీడ్వబడుచుండును గనుక పవిత్రతను చూడజాలదు. దీని దృష్టి అంతయును ఇహలోకము తట్టుయుండును. ఈ నేత్రమునకు సాధ్యమైనవి సాధ్యమైనవిగానే కనబడును. ఇది అసాధ్యమైన విషయములను చూడ శక్తిలేని నేత్రము. విశ్వాస నేత్రము:- విశ్వాసమును నేత్రము అనవచ్చును. ఎందుచేతనంటే ఇది అన్నిటిని చూడగలదు. దీనికి దూరదృష్టి (దివ్యదృష్టి) కలదు. ఈ కంటికి , అసాధ్యమైన విషయములు సాధ్యములుగా కనిపించును. ఇది లోక సంబంధు...

ఆదివార ప్రమేయము - 3

1) బోధకుడు ప్రసంగము బాగుగా సిద్ధపడకుండ రాకూడదు. 2) సంఘములో ప్రతివారిని గూర్చి , మనస్సులో ముందే ప్రార్థించుట మంచివాడుక , మంచి సమయము. 3) కొందరు బోధకులు గుడికివచ్చి , అప్పుడే పాఠము చూచుకొని ప్రసంగింతురు. ఇది మంచివాడుక కాదు. 4) బోధకుడు ముందే ప్రతికుటుంబమును గూర్చి జ్ఞాపకముచేసికొని ప్రార్థించుట మంచిది. 5) దీర్ఘ ఆరాధనగాని , దీర్ఘ ప్రసంగముగాని మానుట మంచిది. 6) ప్రోగ్రాము ముందుగానే తయారుచేయుట మంచిది. ఏ కీర్తన పాడవలెనో , ఏ వాక్యభాగములు చదువవలెనో ముందే ఏర్పాటు చేయుట మంచిది. 7) కొందరు సంఘస్థులు ఆలస్యముగా వత్తురు. ఇది మంచివాడుక కాదు. 8) కొందరు చివరి దీవెన పొందకుండ ఇంటికి వెళ్ళుదురు. ఇది మంచివాడుక కాదు. 9) పిల్లలు ఏడ్చినప్పుడు బయటికి తీసికొని వెళ్ళవలెను. 10) కొన్ని ఆలయములలో ఆరాధన ఆరంభించినప్పుడు తలుపులువేసి , ఆరాధన ముగిసిన తరువాత తలుపులు తీయుదురు. 11) గుడిలోనికి వచ్చిన తర్వాత ఇతర సంగతులేమియు మాట్లాడరాదు. 12) చందా ప్లేటులో లేదా సంచిలో చిల్లర మార్చుట పనికిరాదు. ఆరాధనకు ముందే చిల్లర సంపాదించుకొని రావలెను. 13) ఆరాధన సమయములో ఆల్టరు దగ్గర ఎవ్వరూ నడవకూడదు. అనగా బోధకుని ఎదుటగాని , వెనుకగాని ఎవరును నడువక...

ఆదివార ప్రమేయము - 2

ఆరాధన క్రమము : ఎవరి ఇష్ట ప్రకారము వారు ఆదివార ప్రోగ్రాము (కార్య క్రమమును) ఏర్పరచుకొన వచ్చును. అయితే వెయ్యేండ్ల పరిపాలనలో జరుగనైయున్న ఆరాధనను , ప్రతి ఆరాధనలోను జ్ఞాపకమునకు తెచ్చుకొనవలెను. 1) సంఘము కూడుకొనగానే కిన్నెరమీద (గిటారుమీద సంగీత వాయిద్యము) ఒక కీర్తన వాయించవలెను. ఇది సంఘమునకు ప్రారంభ ఉద్రేకము కలిగించును. 2) తర్వాత ఒక స్తుతి కీర్తన పాడవలెను లేదా పరిశుద్ధాత్మను పిలుచునట్టి కీర్తనయైనను పాడవలెను. 3) ' తండ్రియొక్కయు , కుమారుని యొక్కయు , పరిశుద్ధాత్మ యొక్కయు నామమందు ఆరాధన ఆరంభించుదము ' అని బోధకుడు చెప్పగా సంఘము ' ఆమేన్ ' అనవలెను. 4) సంఘము రెండు మూడు నిమిషములు త్రియేక దేవుని తలంచుకొని నిశ్శబ్దముగా నుండవలెను. 5) అప్పుడు బోధకుడు పాపపు టొప్పుదల చేయించవలెను (సంఘము మోకాళ్ళూని ఒప్పుదల చేయవలెను). 6) పాపములు క్షమింపబడినవను విశ్వాసము కలిగించుకొనుచు , సంఘము రెండు మూడు నిమిషములు ఊరకుండవలెను. 7) తర్వాత బోధకుడు , సంఘముచేత క్షమాపణార్ధమైన స్తుతి చేయింపవలెను. 8) తరువాత సంఘమంతటిచేత తీర్మానము చేయింపవలెను. ' మాకు తెలిసిన ఏ పొరపాటును చేయము ; చేయకుండుటకు ప్రయత్నించెదమను ...

ఆదివార ప్రమేయము - 1

ఆదివార ఆచారము: 1) ఆదివారమున తండ్రియైన దేవుడు సృష్టి పని ఆరంభించెను. ఆదివారమున కుమారుడైన తండ్రి మరణమునుండి లేచెను. ఆదివారమున పునరుత్థానము ప్రకటన ఆయెను. ఆదివారమున మొదటి క్రైస్తవ సంఘము మీద , మొదటిమారు పరిశుద్ధాత్మ కుమ్మరింపబడెను. తండ్రియొక్కయు , కుమారుని యొక్కయు , పరిశుద్ధాత్మ యొక్కయు మూడు గొప్ప విలువైన కార్యములు ఆదివారమున జరిగినందున , సంఘము ఈ దినమును మరువలేకున్నది. అందుచేతనే ఆదివారము ఆరాధన ఏర్పరచుకొన్నది. (ప్రభువు ఆదివారమున లేవలేదని కొందరి అభిప్రాయము. అయితే ఆయన ఆదివారమున లేచుట అబద్ధముకాదు. ఎందుకనిన , ' ఆదివారము సూర్యోదయమునకు ముందే ఆయన లేచెను ' అని సువార్తలలో వ్రాయబడియున్నది. ఆ వార్తయే అందరికి ప్రకటింపబడెను. సంఘముయొక్క సంతోషములో ప్రభువుకూడ పాలివాడై యుండుటను బట్టియే , శిష్యులు ఆదివారము కూడుకొన్నప్పుడు ప్రభువు వారిమధ్య నిలువబడెను. ఆదివారము కూడు కొన్నప్పుడు చందా పోగుచేయవలెనని పౌలు వ్రాయుచుండెను. దానినిబట్టి చూడగా , ఆదికాల సంఘమునకు ఆరాధనదినము శనివారము కాదుగాని , ఆదివారమని కనబడుచున్నది. 1) ఆదివారమున ఉదయము లేవడముతోనే ప్రభువుయొక్క పునరుత్థానము తలంచుకొని విజయస్తుతి చేయవలెను. 2) సాధ్య...