Skip to main content

ఆదివార ప్రమేయము - 1

ఆదివార ఆచారము: 1) ఆదివారమున తండ్రియైన దేవుడు సృష్టి పని ఆరంభించెను. ఆదివారమున కుమారుడైన తండ్రి మరణమునుండి లేచెను. ఆదివారమున పునరుత్థానము ప్రకటన ఆయెను. ఆదివారమున మొదటి క్రైస్తవ సంఘము మీద, మొదటిమారు పరిశుద్ధాత్మ కుమ్మరింపబడెను. తండ్రియొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు మూడు గొప్ప విలువైన కార్యములు ఆదివారమున జరిగినందున, సంఘము ఈ దినమును మరువలేకున్నది. అందుచేతనే ఆదివారము ఆరాధన ఏర్పరచుకొన్నది. (ప్రభువు ఆదివారమున లేవలేదని కొందరి అభిప్రాయము. అయితే ఆయన ఆదివారమున లేచుట అబద్ధముకాదు. ఎందుకనిన, 'ఆదివారము సూర్యోదయమునకు ముందే ఆయన లేచెను' అని సువార్తలలో వ్రాయబడియున్నది. ఆ వార్తయే అందరికి ప్రకటింపబడెను. సంఘముయొక్క సంతోషములో ప్రభువుకూడ పాలివాడై యుండుటను బట్టియే, శిష్యులు ఆదివారము కూడుకొన్నప్పుడు ప్రభువు వారిమధ్య నిలువబడెను. ఆదివారము కూడు కొన్నప్పుడు చందా పోగుచేయవలెనని పౌలు వ్రాయుచుండెను. దానినిబట్టి చూడగా, ఆదికాల సంఘమునకు ఆరాధనదినము శనివారము కాదుగాని, ఆదివారమని కనబడుచున్నది.

1) ఆదివారమున ఉదయము లేవడముతోనే ప్రభువుయొక్క పునరుత్థానము తలంచుకొని విజయస్తుతి చేయవలెను. 2) సాధ్యమైనంత వరకు శరీర సంబంధమైన పనులుగాని, లోక సంబంధమైన పనులుగాని, ఆటపాటలు గాని లేకుండ నుండవలెను. అనగా బజారుకు వెళ్లుట, ఇళ్ళు వాకిండ్లు అలుకుట, ఊరు ప్రయాణము చేయుట, లోక సంబంధమైన పనిమీద ఒకరి ఇంటికి వెళ్ళుట, లోక సంబంధమైన మంచి మంచి పుస్తకములు చదువుట మొదలగునవన్నియు మానివేయవలెను. (వంట, స్నానము తప్పదుగదా!) క్రైస్తవ దేశములలో కొందరు వంట అంతకు ముందు దినమే తయారు చేసికొందురు, కొందరు అదికూడ తినరు, కొందరు చాలసేపు నిద్రపోరు. 3) కొందరు బైబిలు చదువుటలోను, కీర్తనలు పాడుకొనుటలోను, వ్యాఖ్యానములు చదువు కొనుటలోను, దినమంతయు గడిపివేయుదురు. ఇది మహా మంచివాడుక. 4) ఆదివారమునకు కావలసినవి అన్నియు శనివారమే సిద్ధపరచుకొనవలెను. అది మనకు సిద్ధపరచుకొనే రోజు. 5) ఆదివారమంతయు మహిమ సంగతులు, పరిశుద్ధ సంగతులు, దైవోపకార కార్యములు ఈ మొదలైనవే తలంపులోనికి, బలవంతముగానైనను రప్పించుకొనవలెను. ఇట్టివి పుస్తకములో వ్రాసికొని ధ్యానించుట మొదలుపెట్టిన యెడల, రాత్రివరకు అట్టి ధ్యానముండును. అంత పెద్దనోట్సు తయారుచేసికొనవలెను. 6) యెషయా 58:13,14లో ఉన్న సంగతులనుబట్టి విశ్రాంతి దినమును గౌరవపరచు వారు ఉన్నత స్థలమును ఆక్రమించుకొందురు. ఎవరు 1) దేవునిని, 2) ఆయన వాక్యమును, 3) ఆయన ఉపకారములను, 4) ఆయన సంఘమును, 5) ఆయన సంకల్పనను (ఏర్పాటును) గౌరవింతురో, వారిని ఆయన గౌరవించును. 6) ఎవరు ఆరాధన దినమును గౌరవింతురో, ఆయన వారిని గౌరవించును. ఎవరు ఆరాధన దినమును గౌరవింతురో, వారి దినములను దేవుడు గౌరవించి దీవించును. 7) ఆదివారము ఎట్లు గడుపవలెనో, ప్రకటన మొదటి అధ్యాయము వలన నేర్చుకొను చున్నాము.

 i) యోహాను ఆదివారమున ఆత్మవశుడాయెను. (మనమును మోకాళ్ళ మీదనున్న యెడల, ఆత్మ మనలోనికి ప్రవేశించును).

ii) యోహాను బూరవంటి స్వరము వినెను. (మనముకూడ ఆదివారమున స్వరము వినవలెను).

iii) యోహాను విన్న సంగతులు వ్రాసెను. (మనముకూడ ఆవేళ విను వాక్యములు, ప్రత్యేకమైన పుస్తకములో వ్రాయవలెను).

iv) యోహాను దేవునియొక్క మహిమ స్వరూపమును చూడగల్గెను, అనగా దర్శనము పొందెను. (మనము కూడ ఆవేళ మిక్కిలి స్పష్టముగా ప్రభువును చూడవలెను).

V) యోహాను ఆత్మవశమాయెను. చెవులతో వినెను, కంటితో చూచెను. ఆలాగు వినిన, చూచిన వాటిని వ్రాసెను. ఈ నాలుగుపనులు మనముకూడ చేయవలెను.

vi) యోహాను, క్రీస్తు మహిమ ఎదుట శవమాయెను. అప్పుడు ప్రభువు- 'భయపడవద్దు, నేను సజీవుడను, పాతాళ లోకముయొక్క తాళపు చెవులు నా చేతిలో నున్నవి' అని పలికిరి. (మనము అట్లుపడియుండే అవసరము లేదు). పెండ్లికుమార్తె శాఖవారు అట్లు పడరు, సంతోషముతో నుందురు. యోహానుకు అది క్రొత్త అనుభవము గనుక అట్లు జరిగెను.

అప్పటి యోహాను చరిత్ర ఏదనగా వృద్ధుడు, ఖైది, తోటివారందరు చనిపోయిరి. సువార్త చేయవలెనన్న యెడల కట్టు (బంధకములు). షరా: మహిమ యెదుట యోహాను శవమై యుండుట నిజమేగాని, శ్రమలయెదుటను శవమై యుండవలెను. వృద్ధుడు ఆయెననగా, త్వరలో మృతుడు కాబోవుచున్నాడు. 'మృతుల లోకముయొక్క తాళపు చెవులు నా చేతిలోనున్నవని' ప్రభువు చెప్పెను. గనుక మృతుడైనను పరవాలేదు 'నిన్ను పాతిపెట్టుదురు, శవము పాతాళమునకు వెళ్ళును. అనగా భూస్థాపన చేయుదురు. అయినను పరవాలేదు, పాతాళలోకపు తాళపుచెవులు నా చేతిలో నున్నవి' అని ప్రభువు చెప్పెను. ఈ కన్ను చూడని కథలు, ఆ కన్ను చూచినది. ఆ వృద్ధాప్య హస్తము ప్రకటన గ్రంథమంతయు వ్రాసెను. శరీరముయొక్క కృశింపుతోగాని, నేత్రములతోగాని, జ్ఞాపక శక్తితోగాని, హస్తములతోగాని ఏమియు పనిలేనట్లు, దేవుడు మరియొక ప్రత్యేక బలమిచ్చి, మహిమ చూపించి వ్రాయించెను. బంధకములని, చెర అని, ఖైది అని ఎన్ని ఆటంకములు ఉన్నను, ప్రభువు తన పని చేయించక మానడు. అవన్నియు ఆయనకు అడ్డు రావు.

Comments

Popular posts from this blog

దైవలక్షణముల స్తుతి (సంఘారాధనలోని స్తుతులు)

అనాది :- అనాది దేవా! సృష్టింపబడకుండ నీ యంతట నీవే ఉన్నావు , గనుక నీవు ముందే ఉండి , మా చరిత్ర అంతటిని చూచుచు మాకు కావలసినవన్నియు ముందే ఏర్పాటు చేసియున్నావు. గనుక నీకు మా వందనములు. అనంతము :- అనంత దేవా! నీవు ఎల్లప్పుడు ఉండువాడవు గనుక అంతములేని కాలము వరకు కావలసినవన్నియు మేము అనుభవించుటకై నీ అనంత సన్నిధిని మా కొరకై ఉంచిన నీకు స్తుతులు. ప్రేమ :- ప్రేమవైయున్న తండ్రీ! నీవు ముగ్గురుగా (త్రిత్వముగా) బయలు పడకపోయిన , మేము నిన్ను ప్రేమించుట ఉండదు. నీ ప్రేమ సృష్టి యంతటిలోను కనబడుచున్నది. మేము మా పిల్లలను ప్రేమించుటకన్న నీవు మమ్మును ప్రేమించుటయే ఎక్కువైయున్నది. మమ్మును కలుగజే సిన నీవు మమ్మును ప్రేమించక యింకేమి చేయుదువు! గనుక నీ ప్రేమను బట్టియే మానవునికి కావలసినవన్నియు ఆలోచించి చేసినావు. ఆ నీ ప్రేమనుబట్టియే సహించుచు , శిక్షించుచు , క్షమించుచున్నావు. మరియు అట్టి నీ ప్రేమను బట్టియే మా పాపములను జ్ఞాపకము చేసికొనను అన్నావు. గనుక నీకు వందనములు. పరిశుద్ధత :- పరిశుద్ధుడవైన జనకా! సర్వసృష్టిని , మానవుని , పరిశుద్ధముగానే చేసియున్నావు. పాపప్రవేశమును బట్టి మేము పాపులమైనను , నీ పరిశుద్ధతను బట్టి మరల మాకు పరి...

దైవలక్షణముల స్తుతి (సమర్పణ ప్రార్ధనలోని స్తుతులు)

  1. దేవా , తండ్రీ! నా నిమిత్తమై సమస్తమును కలుగజేసిన తండ్రీ! అనుదినము మాకు కావలసినవన్నియు అందించుచున్న తండ్రీ! నా ప్రియుడవైన తండ్రీ! నా దేవా , నా ప్రభువా! పోషకుడా , నా రక్షకుడా , నా సర్వమా! నీ కనేక నమస్కారములు. తండ్రీ! సృష్టి మూలముగ మాత్రమేగాక , నీ కుమారుని మూలముగ కూడ నన్ను నీ బిడ్డగా ఏర్పరచు కొన్నందులకై నీ కనేక వందనములు. నీ దానముల మూలముగాను , నీ సహింపు మూలముగాను , నీ నడిపింపు మూలముగాను , మా కష్టములు నివారణ చేయు నీ క్రియల మూలముగాను , నాకు నీవు చూపుచున్న ప్రేమను త లంచుకొని నిన్ను స్తుతించుచున్నాను. గాని నా స్తుతి నీ ప్రేమ యెదుట యేమాత్రము ? నా అంతరంగమందున్న కృతజ్ఞత నీ అనంత ప్రేమ యెదుట యేమాత్రము ? నేను ఏదియు ముట్టుకొనక స్తుతి మాత్రమే చేసినను అది సహితము నీ కనికరము యెదుట మిక్కిలి స్వల్పమై ఉండును. ఆ స్వల్ప స్తుతులను కూడ హస్తార్పణముగ అందుకొనుచున్నావు. గనుక నీకు వందనములు. నీవు నన్ను నేటివరకు కాపాడుచు , నడిపించుచు , వృద్ధిలోనికి తీసికొనివచ్చుచున్న నీ శక్తిని తలంచుకొని స్తుతించుచు , యిక ముందునకు కూడ నా విషయములో యిట్టి కార్యములు చేయుచుందువని నమ్ముచు నిన్ను స్తుతించుచున్నాను. నా జీవితాంతమందు ...

రెండు ద్వారములు, మత్తయి 6:33 - (యం. దేవదాసు అయ్యగారి ఉపదేశము.) తేది 12 — 10 — 1958

రెండు ద్వారములబడి దేవుని రాజ్యములోనికి, దేవుని సంఘము లోనికి రావలసినవారికి ఈ వాక్యమందు వర్తమానమున్నది. మన దేవాలయమునకున్నది ఒక ద్వారము. ఇక్కడ నిండి పోయినందువల్ల ఒక్కొక్క ఆదివారము వెనుక ద్వారము గుండా వచ్చి ఇక్కడ కూర్చుని వింటారు. వారుకూడా ఆరాధనలో పాల్గొంటారు. ఈ వాక్యమును విడదీసికొందాము. అందులో రెండు గొప్ప మాటలు ఉన్నాయి. (1) దేవుని రాజ్యము (2) ఆయన యొక్క నీతి దేవునియొక్క రాజ్యముగా దేవునియొక్క గవర్నమెంటు. ఈ గవర్నమెంటుకు ఆయనే రాజు. అయితే దేవుని రాజ్యమెక్కడ ఉన్నది ? మన హిందూ దేశము నేలే గవర్నమెంటు. రాజ్యము ఢిల్లీలో ఉన్నది. వారి రాజ్య ప్రవేశము హిమాలయమునుండి కన్యాకుమారి వరకు ఉన్నది. అలాగుననే దేవుని రాజ్యముకూడా నున్నది. ఇంగ్లండు దేశము వారికి వారి దేశమే వారి రాజ్యము. వారు ఇతర దేశములు కూడా గెలుచుకుంటే అది కూడా వారి రాజ్యమే. అలాగే జపాను వారున్నది జపాన్ రాజ్యము వారెక్కడైనా గెలుచుకుంటే అది వారి రాజ్యమే. అలాగుననే దేవునిరాజ్య మెక్కడ నున్నది ? అనేది ఒక గొప్ప ప్రశ్న. ప్రభువు 1. ఆయన రాజ్యమును వెదకమన్నారు. రాజ్య మెక్కడనున్నదో తెలియకపోతే ఎలాగు? ఎక్కడున్నదో చెప్పే వెనుకనున్నారు. మత్తయి 6 అధ్యాయములో...