Skip to main content

ప్రత్యేకమైన ప్రార్థన (మత్తయి 6:6)

 మనకు తెలిసిన వాక్యములు సందర్భానుసారముగా చదువుకొనిన యెడల, క్రొత్త వెలుగు దానిలోనుండి బయటకు వచ్చును.

1. త్రియేక దేవుడవైన తండ్రీ! విపత్తు కాలములో మేము నీకు ఒక మనవి చేయుటకై సంతోషముతో వచ్చియున్నాము. విచారము, భయము, స్వేచ్ఛలేనితనము ఉండవలసిన సమయమిదే. అయినను మీ వాక్య వాగ్ధానమునుబట్టి సంతోషము, ధైర్యము, స్వేచ్ఛ, సేవలో తీవ్రత కలిగియుండవలసిన సమయముకూడ ఇదే. మొదటి శతాబ్ధములో ఈ సంఘమును వ్రేళ్ళతోపాటు నాశనము చేయవలెనని ఉద్దేశించిన, సర్వభూగోళ చక్రవర్తులైన రోమా దేశీయులు ఏమియు చేయలేకపోయిరి. అందుచేత నీ సంఘము ఒక నదివలె ఇరువది శతాబ్ధముల వరకు, మా యొద్దకు ప్రవహించుచు వచ్చినది. ఇది నీ ప్రభావము గనుక నీకు స్తోత్రములు.

2. నేడు మా కాలములో, మా దేశములో, నీ సంఘముయొక్క మేళ్ళు అనేక విధములుగా అనుభవించుచున్న అనేకులు, నీ సంఘమును వృద్ధికాకుండ చేయవలెననియు; క్రైస్తవులు, హిందూ దేశ మతములోనికి మరలా రావలెననియు; దేశీయమతము యుండగా పరదేశమతము ఎందుకని వాదించుచున్నారు. మరియు బైబిలులో కాని సంగతులు అనేకములున్నవని ద్వేషభావముతో పలుకుచున్నారు. పత్రికలు వేయుచున్నారు. గ్రంధములు ప్రచురించుచున్నారు. గనుక దేవా! వారి ఆలోచనలను బంధించుము. వారి మాటలను, ఉపన్యాసములను బంధించుము. వారి పత్రికాదులను బంధించుము. వారి ఇతర ప్రయత్నములను బంధించుము. అనగా హానిచేయు ప్రయత్నములను బంధించుము. కాని ముందుగా మేము, మా ప్రార్థన గదిలో వాటిని బంధింపగల చురుకుతనము దయచేయుము. భయమును, అపనమ్మకమును మాలోనుండి తీసివేయుము. అప్పుడు మేము బంధింపగలము.

3. ఇశ్రాయేలీయులయొక్క శత్రువులను చెలరేగనిచ్చినట్లుగా, మా శత్రువులను చెలరేగనిచ్చుట అనగా వారు చెలరేగుచుండగా, నీవు ఊరకుండుట ఎందుకనగా మా చేత ప్రార్థనలు చేయించుటకే; మా చేత ఎక్కువ సేవ బహు తీవ్రముగా కొనసాగించుటకే. అందుకే నీవు మౌనముగా నున్నావు గనుక నీకు వందనములు.

4. వారు ఏయే ప్రయత్నములు చేయుచున్నారో, ఆయా ప్రయత్నములకు మించిపోవు ప్రయత్నములు, మేము సదుద్దేశ్యముతో చేయులాగున, మాకు శాంత మనస్సును, జ్ఞానోదయమును అనుగ్రహింపుము.

5. మరియు వారు వారి దేవతలను ప్రార్థించుచుండగా మేము నిన్ను ప్రార్థించుచున్నాము. వారు (దుర్భోధన) ప్రచారము చేయుచుండగా, మేముకూడ సద్భోధ ప్రచారము చేయునట్లు, మా నోళ్ళకు, మోకాళ్ళకు సత్తువ దయచేయుము. వారు బాహాటమైన సభలలో గంభీరమగు దూషణోపన్యాసములు చేయుచుండగా మేము- 'నిన్ను అడుగు ప్రతివానికి సమాధానము చెప్పుము' అను వాక్య ప్రకారము, వారికి న్యాయమైన రీతిని నచ్చచెప్పగల ఉపన్యాసములు చేయుటకు, మా గుండెకు సత్తువ; మా జ్ఞానమునకు శక్తి, సమాధానము చెప్పగల వాక్యములను మా జ్ఞప్తికి అందించుము. ఎందుకనిన 'మీరు కాదు, వారికి ఏమి జవాబు చెప్పవలెనో, అది ఆత్మయే మీకు అందించును' అని వ్రాయించినావుగదా! (మత్తయి 10:19,20). గనుక మాకు నీ ఆత్మ సహాయము చూపించుము. దర్శనవరముగలవారికి ప్రత్యక్షమగుము. వారి పత్రికలకు, పుస్తకములకు తగిన జవాబు వ్రాయుటకై మా హస్తములకు చాకచక్యము, వాటిని అచ్చువేయించుటకు కావలసిన ధనరాశిని సమకూర్చుము. వారు కుట్రాలోచన చేయుచుండగా మేము మంచి ఆలోచనలు చేయుటకై మంచి ఆలోచనను మాలో పుట్టించుము.

6. మా ప్రభువా! నీవు సిలువ మ్రానుమీద నున్నప్పుడు 'తండ్రీ! వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించుము' అని ప్రార్థించిన విధముగా మేముకూడ ప్రార్థించునట్లు మమ్మును క్షమాపణ స్థితికి నడిపింపుము. మరియు తండ్రీ వారినికాదు, వారియొక్క దుష్ట ప్రయత్నములను దుంపనాశనము చేయుము. ఈ సమయమందే చైనాలో జరిగినట్లు, మా దేశస్థులుకూడ బైబిలుకొరకు బైబిలు సొసైటీ వారికి వ్రాసికొనునట్లు ప్రేరేపించుము. ప్రజలందరు మాకు క్రైస్తవ బోధలు, క్రైస్తవ పత్రికలు, పుస్తకములు కావలెనని కేకవేయగల ఆర్భాటశక్తి ప్రజలలో కల్గించుము.

7. ఓ దేవా! అంతములేని కృపగల దేవా! నీకు స్తోత్రములు. సాతాను తనకు ఎక్కువ సమయములేదని చెలరేగి విశ్వాసులమీద పడుచున్నాడు. అతని ఆలోచనలు సాగనీయకుము. అతని ప్రయత్నములు నెరవేరనీయకుము. అతని పన్నాగములను చెడగొట్టుము. అలాగుననే ఇప్పుడును లోకమంతట తిరిగే భూతములను వాటియొక్క పనులను నీవు బంధించుము. ఆమేన్.

షరా:- 1) మన దృష్టిలో ఎవరైనా బంధింపబడిన వారున్నయెడల వారిని తలంచుకొని ఈ పైన వ్రాసిన విధముగా ప్రార్థించవలెను. 2) సాతాను ఎదిరింపుల పుస్తకము 6వ పేజిలో 11వ ఎదిరింపును చూడండి.

Comments

Popular posts from this blog

దైవలక్షణముల స్తుతి (సంఘారాధనలోని స్తుతులు)

అనాది :- అనాది దేవా! సృష్టింపబడకుండ నీ యంతట నీవే ఉన్నావు , గనుక నీవు ముందే ఉండి , మా చరిత్ర అంతటిని చూచుచు మాకు కావలసినవన్నియు ముందే ఏర్పాటు చేసియున్నావు. గనుక నీకు మా వందనములు. అనంతము :- అనంత దేవా! నీవు ఎల్లప్పుడు ఉండువాడవు గనుక అంతములేని కాలము వరకు కావలసినవన్నియు మేము అనుభవించుటకై నీ అనంత సన్నిధిని మా కొరకై ఉంచిన నీకు స్తుతులు. ప్రేమ :- ప్రేమవైయున్న తండ్రీ! నీవు ముగ్గురుగా (త్రిత్వముగా) బయలు పడకపోయిన , మేము నిన్ను ప్రేమించుట ఉండదు. నీ ప్రేమ సృష్టి యంతటిలోను కనబడుచున్నది. మేము మా పిల్లలను ప్రేమించుటకన్న నీవు మమ్మును ప్రేమించుటయే ఎక్కువైయున్నది. మమ్మును కలుగజే సిన నీవు మమ్మును ప్రేమించక యింకేమి చేయుదువు! గనుక నీ ప్రేమను బట్టియే మానవునికి కావలసినవన్నియు ఆలోచించి చేసినావు. ఆ నీ ప్రేమనుబట్టియే సహించుచు , శిక్షించుచు , క్షమించుచున్నావు. మరియు అట్టి నీ ప్రేమను బట్టియే మా పాపములను జ్ఞాపకము చేసికొనను అన్నావు. గనుక నీకు వందనములు. పరిశుద్ధత :- పరిశుద్ధుడవైన జనకా! సర్వసృష్టిని , మానవుని , పరిశుద్ధముగానే చేసియున్నావు. పాపప్రవేశమును బట్టి మేము పాపులమైనను , నీ పరిశుద్ధతను బట్టి మరల మాకు పరి...

దైవలక్షణముల స్తుతి (సమర్పణ ప్రార్ధనలోని స్తుతులు)

  1. దేవా , తండ్రీ! నా నిమిత్తమై సమస్తమును కలుగజేసిన తండ్రీ! అనుదినము మాకు కావలసినవన్నియు అందించుచున్న తండ్రీ! నా ప్రియుడవైన తండ్రీ! నా దేవా , నా ప్రభువా! పోషకుడా , నా రక్షకుడా , నా సర్వమా! నీ కనేక నమస్కారములు. తండ్రీ! సృష్టి మూలముగ మాత్రమేగాక , నీ కుమారుని మూలముగ కూడ నన్ను నీ బిడ్డగా ఏర్పరచు కొన్నందులకై నీ కనేక వందనములు. నీ దానముల మూలముగాను , నీ సహింపు మూలముగాను , నీ నడిపింపు మూలముగాను , మా కష్టములు నివారణ చేయు నీ క్రియల మూలముగాను , నాకు నీవు చూపుచున్న ప్రేమను త లంచుకొని నిన్ను స్తుతించుచున్నాను. గాని నా స్తుతి నీ ప్రేమ యెదుట యేమాత్రము ? నా అంతరంగమందున్న కృతజ్ఞత నీ అనంత ప్రేమ యెదుట యేమాత్రము ? నేను ఏదియు ముట్టుకొనక స్తుతి మాత్రమే చేసినను అది సహితము నీ కనికరము యెదుట మిక్కిలి స్వల్పమై ఉండును. ఆ స్వల్ప స్తుతులను కూడ హస్తార్పణముగ అందుకొనుచున్నావు. గనుక నీకు వందనములు. నీవు నన్ను నేటివరకు కాపాడుచు , నడిపించుచు , వృద్ధిలోనికి తీసికొనివచ్చుచున్న నీ శక్తిని తలంచుకొని స్తుతించుచు , యిక ముందునకు కూడ నా విషయములో యిట్టి కార్యములు చేయుచుందువని నమ్ముచు నిన్ను స్తుతించుచున్నాను. నా జీవితాంతమందు ...

రెండు ద్వారములు, మత్తయి 6:33 - (యం. దేవదాసు అయ్యగారి ఉపదేశము.) తేది 12 — 10 — 1958

రెండు ద్వారములబడి దేవుని రాజ్యములోనికి, దేవుని సంఘము లోనికి రావలసినవారికి ఈ వాక్యమందు వర్తమానమున్నది. మన దేవాలయమునకున్నది ఒక ద్వారము. ఇక్కడ నిండి పోయినందువల్ల ఒక్కొక్క ఆదివారము వెనుక ద్వారము గుండా వచ్చి ఇక్కడ కూర్చుని వింటారు. వారుకూడా ఆరాధనలో పాల్గొంటారు. ఈ వాక్యమును విడదీసికొందాము. అందులో రెండు గొప్ప మాటలు ఉన్నాయి. (1) దేవుని రాజ్యము (2) ఆయన యొక్క నీతి దేవునియొక్క రాజ్యముగా దేవునియొక్క గవర్నమెంటు. ఈ గవర్నమెంటుకు ఆయనే రాజు. అయితే దేవుని రాజ్యమెక్కడ ఉన్నది ? మన హిందూ దేశము నేలే గవర్నమెంటు. రాజ్యము ఢిల్లీలో ఉన్నది. వారి రాజ్య ప్రవేశము హిమాలయమునుండి కన్యాకుమారి వరకు ఉన్నది. అలాగుననే దేవుని రాజ్యముకూడా నున్నది. ఇంగ్లండు దేశము వారికి వారి దేశమే వారి రాజ్యము. వారు ఇతర దేశములు కూడా గెలుచుకుంటే అది కూడా వారి రాజ్యమే. అలాగే జపాను వారున్నది జపాన్ రాజ్యము వారెక్కడైనా గెలుచుకుంటే అది వారి రాజ్యమే. అలాగుననే దేవునిరాజ్య మెక్కడ నున్నది ? అనేది ఒక గొప్ప ప్రశ్న. ప్రభువు 1. ఆయన రాజ్యమును వెదకమన్నారు. రాజ్య మెక్కడనున్నదో తెలియకపోతే ఎలాగు? ఎక్కడున్నదో చెప్పే వెనుకనున్నారు. మత్తయి 6 అధ్యాయములో...