స్తుతులు : దేవా తండ్రీ! నా నిమిత్తమై సమస్తమును కలుగజేసిన తండ్రీ! అనుదినము మాకు కావలసినవన్నియు అందించుచున్న తండ్రీ! నేను అందుకొనలేని బిడ్డనైనను మానకుండ అందించుచున్న తండ్రీ! నన్ను కలుగజేసిన తండ్రీ! నా ప్రియుడవైన తండ్రీ! నా దేవా! నా ప్రభువా! నా పోషకుడా! నా రక్షకుడా! నా సర్వమా! నీకనేక నమస్కారములు. తండ్రీ! సృష్టిమూలముగా మాత్రమేకాక, నీ కుమారుని మూలముగా కూడ నన్ను నీ బిడ్డగా ఏర్పరచు కొన్నందులకై నీకనేక వందనములు.
నీ
దానముల మూలముగాను,
నీ సహింపు మూలముగాను,
నీ నడిపింపు మూలముగాను, మా కష్టములు నివారణచేయు నీ
క్రియల మూలముగాను,
నీవు మాకు చేయు ఉపకారముల మూలముగాను నాకు నీవు చూపుచున్న
ప్రేమను తలంచుకొని నిన్ను స్తుతించుచున్నాను,
గాని నా స్తుతి నీ ప్రేమ ఎదుట ఏ మాత్రము! నా అంతరంగమందున్న
కృతజ్ఞత నీ అంత ప్రేమ ఎదుట ఏ మాత్రము! నేను ఏ పనియు ముట్టుకొనక స్తుతి మాత్రమే
చేసినను, అది సహితము నీ కనికరము ఎదుట మిక్కిలి స్వల్పమై యుండును. ఆ స్వల్ప స్తుతులనుకూడ
నీవు హస్తార్పణముగా అందుకొను చున్నావు,
గనుక నీకు వందనములు. నీవు నన్ను నేటివరకు కాపాడుచు, నడిపించుచు వృద్ధిలోనికి తీసికొని వచ్చుచున్న నీ శక్తిని తలంచుకొని
స్తుతించుచు,
ఇక ముందునకుకూడా నా విషయములో ఇట్టి కార్యములు చేయుచుందువని
నమ్ముచు నిన్ను స్తుతించుచున్నాను. నా జీవితాంతమందు నిశ్చయముగా నన్ను పరలోకమునకు చేర్చుకొందువని నిరీక్షించుచున్నాను. నీకనేక వందనములు.
2. 1) అనాది
దేవా! అనంత దేవా! ఉన్నదేవా! సృష్టిపబడకుండ ఉన్న దేవా! ఈ నీ గొప్పతనమునకు అనేక
స్తోత్రములు.
2)
అనంత దేవా! నీవు ఎల్లప్పుడు ఉండగల దేవుడవు. గనుక నీకు
స్తోత్రములు. నీవు ఎల్లప్పుడు ఉండువాడవు గనుక నీకు అనంత స్తోత్రములు.
3)
జీవమైయున్న దేవా! నాలోని జీవము నా బలహీనతను బట్టి నిర్జీవ
స్థితిలోనికి వచ్చుచున్నప్పుడు మరల నాలో నూతన జీవము ధారపోయుదువు గనుక నీకు
నిత్యజీవ స్తోత్రములు.
4)
శక్తిమంతుడవగు దేవా! నా విషయములో ఎంత గొప్ప కష్టమైన
పనియైనను, అసాధ్యమైన పనియైనను చేయగలవు గనుక నీకు నా శక్తికొలది వందనములు.
5)
జ్ఞానివైయున్న దేవా! నీవు జ్ఞానివి గనుక నా కష్టములు, నా
కోరికలు నేను నీకు చెప్పుకొనకముందే నీకు తెలిసేయున్నవి. అందుచేతనే నీవు నా
కోర్కెలు తీర్చగలవు. నా కోర్కెలు నెరవేర్చుటకు ఎన్నో చిక్కులు అడ్డముగానున్నను, ఆ
చిక్కులన్నియు విడదీసి నా కోర్కె నెరవేర్చగల జ్ఞానోపాయము నీకు గలదు. గనుక నీకు
నాకు తెలిసినన్ని వందనములు. నా జ్ఞానమునకు తోచినన్ని వందనములు చేయుచున్నాను.
6)
పరిశుద్ధుడవైన దేవా! నీవు నన్నును, సమస్తమును
కలుగ జేసినప్పుడు పరిశుద్ధముగానే కలుగజేసినావు గాని పాపప్రవేశమును బట్టి నాకు
అపరిశుద్ధత కలిగెను. అయినను నీ పరిశుద్ధతనుబట్టి నాకు మరల పరిశుద్ధత దయచేయగలవు గనుక
నిష్కళంకమైన పరిశుద్ధ మనస్సుతో నీకు స్తుతి చేయుచున్నాను.
7)
ప్రేమాస్వరూపివైన తండ్రీ! భూలోకమందలి తల్లిదండ్రులు తమ
బిడ్డలను ప్రేమించుటకన్నను,
నన్ను నీవు ఎంతో ఎక్కువగా ప్రేమించు చున్నావు. కాబట్టి నీకు
నా వందనములు.
8)
న్యాయస్వరూపివైన దేవా! నేను పొరబాటులోనున్నప్పుడు
న్యాయమైనరీతిగా నన్ను గద్దించి,
ప్రేమతో శిక్షించు దేవుడవు గనుక నీకు వందనములు ఆచరించుట
న్యాయమైయున్నది. గనుక నీకు వందనములు ఆచరించుచున్నాను.
9)
నిరాకారుడవైన దేవా! నా బలహీనతనుబట్టి నేను నిన్ను
చూడలేకపోయినను నీవు నన్ను చూచుచున్నావు. నీవు నిరాకారుడవు అయినప్పటికిని నాకు
ఉపయోగకరమైన శరీరాకారమును దయచేసినావు. మరియు నా ఆత్మకు నిరాకారము అనుగ్రహించినావు.
కాబట్టి నా శరీరముతోను,
నా ఆత్మతోను నిన్ను స్తుతించుచున్నాను.
10)
సర్వవ్యాపివైయున్న తండ్రీ! నీవు పరలోకమందును, భూలోకమందును
అన్ని స్థలములలో నుండగలవాడవు గనుక నీకు స్తోత్రములు. నేను ఎక్కడున్నను నీవు
అక్కడుందువు, ఉండగలవు. నీవు నాకు జతగా నుండగలవు,
ఉండి సహాయము చేయగలవు. 'నేను ఒంటరిగా నున్నాను' అను చింత లేకుండా చేయగలవు
గనుక నీకు వందనములు. అన్ని స్థలములలో నీకు వందనములు.
11)
స్వతంత్రుడవైన ప్రభువా! సమస్త కార్యములు నీయంతట నీవు చేయగల
తండ్రీ! నీకు స్తోత్రములు. నేనుకూడ స్వతంత్రముగా పనిచేయగల శక్తి అనుగ్రహింపగలవు.
నీమీద మాత్రమే ఆధారపడి నాలోని స్వతంత్రతనుబట్టి, నా కార్యములు చేసికొనగల
స్థితి అనుగ్రహించినావు గనుక నీకు స్తోత్రములు, స్వేచ్ఛాపూర్వకమైన
స్తోత్రములు. బలవంతముగా కాక కేవలము స్వతంత్రముగా నిన్ను స్తుతింపగోరుచున్నాము.
నీ గుణములన్నియు నాకుకూడ అనుగ్రహించుట వలన నీ లక్షణరూపము, నీ
కోరిక నాకు అనుగ్రహించినావు. అన్నియు అనుగ్రహించి ఒక్క స్వతంత్ర లక్షణముగాని
అనుగ్రహింపకున్న యెడల తక్కినవన్ని ఇచ్చిన ప్రయోజనము లేదు. గనుక స్వాతంత్య్ర
లక్షణము ఇచ్చినందుకు స్తోత్రములు.
12)
తండ్రి,
కుమార,
పరిశుద్ధాత్మలను పేరులతో బైలుపడిన త్రియేక దేవుడవైన తండ్రీ!
నీ ప్రత్యక్షత విషయమై నీకనేక వందనములు. నీవు నాకు దాగియుండు దేవుడవుకావు గాని
బైలుపడు దేవుడవు. నీ లక్షణములు,
నీ క్రియలు,
నీ గొప్పతనము నాకు బైలుపర్చు దేవుడవు గనుక నీకు వందనములు.
నీవు ఒక్కడవుగాను,
ముగ్గురుగాను బైలుపడినావు. నీ మర్మము మాకు తెలియదు గాని
నమ్ముచున్నాము. నేను నీ యొద్దకు పరలోకమునకు జేరినప్పుడు తెలిసికొనగలను. నా పరిమిత
జ్ఞానస్థితితో,
నీ అపరిమిత జ్ఞానస్థితిని ఎట్లు తెలిసికొనగలను? అనంతకాలము
నీ విషయములు క్రొత్తక్రొత్తగా తెలిసికొనుచునే ఉందును. నీ ప్రత్యక్షతకును నేను
తెలిసికొనుటకు అంతములేదు గనుక నీకు అంతములేని స్తుతులు చెల్లించుచున్నాను.
13)
మహిమాస్వరూపీ! అనంత స్వరూపీ! నేను నిత్యము నీ మహిమ కొరకు నీ
ముఖ దర్శనములో,
నీ సన్నిధిలో,
నీ సహవాసములో మిగుల ఆనందముగా గడుపగల స్థితి దయచేయుదువని
నమ్ముచు నీకనేక వందనములు చేయుచున్నాను.
14)
మాకు శరీరమును అనుగ్రహించిన దేవా! నీకు వందనములు. ఈ శరీరము
పాపశరీరమైనందున దీనిని పరిశుద్ధ శరీరముగా మార్చుచున్నావు. తుదకు నాకు మహిమ శరీరము
ఇచ్చి నీయొద్దకు తీసికొని వెళ్లుదువు గనుక నీకు వందనములు. నీవు మూడు విధములుగా
బైలుపడినావు. అట్లే నాకు మూడు విధములైన స్థితులు అనుగ్రహించినావు.
జీవము, శరీరము, ఆత్మ అను మూడు స్థితులు దయచేసినందుకు నీకు వందనములు. ఈ మూడు కలిపి నన్ను ఒక
వ్యక్తిగా నిలిపినావు గనుక నీకు స్తోత్రములు. నేను ఒక విధముగా నీకు
బిడ్డవలెనున్నాను. మరియొక లెక్కకు మూడుగానున్నాను. ఈ విచిత్రమైన సృష్టి నిమిత్తమై
నీకు వందనములు. తండ్రీ! నీవు నాకు ఇచ్చినవన్నియు నేను నిలుపుకొనునట్లు నాకు
తోడ్పడుదువని నమ్మి నిన్ను వందించుచున్నాను.
15).
తండ్రీ! నీ స్థితిని,
నీ క్రియలను,
నీ దివ్యలక్షణములను నాయెడల ఉన్న నీ తీరును, నీ
మహిమను ఎవరు వర్ణింపగలరు?
నీకనేక వందనములు.
16).
దానకర్తవైన తండ్రీ! నీ ఉచిత దానముల నిమిత్తమై నీకు
స్తోత్రములు. గాలి ఉచితము,
నేను పన్ను కట్టుట లేదు. ఒకవేళ నేను కట్టినను అది చాలదు. నీ
ఉచిత ధర్మము నిమిత్తమై అవి యున్నంత కాలము నీకు స్తోత్రములు. లోకాన్ని కలుగజేసినది
మొదలుకొని, లోకాంతము వరకు నీవు నరులందరకు,
అవిశ్వాసులకు,
విశ్వాసులకు,
మృగములకు,
వృక్షాదులకు,
జీవరాసులకు ఉచితముగా ధర్మము చేయుచునేయున్నావు. ఇవన్నియు
మేము సంపాదించుకొనవలెనన్న యెడల రవ్వంతయైనను సంపాదించుకొనలేము. ఎన్నో పండ్లు, ఎన్నో
కూరగాయలు ఇచ్చుచున్నావు. మానవులు తినగా ఎన్నో మిగిలిపోవు చున్నవి. నీకనేక
స్తోత్రములు. నీళ్లుకూడ మిగిలిపోవుచున్నవి. నీవు భూమిలో పెట్టిన ఖనిజములు, లోహములు
అనేకములున్నవి. మానవులు ఇంకా వీటిని తీసికొని వాడుకొనలేదు. కొన్ని
వాడుకొనుచున్నారు గాని తరగడములేదు. నీవు మా యెదుట వేసిన భోజనపు బల్లమీదనున్న
పదార్ధములు ఇంకా తరగడములేదు. ఒకదరినుండి మేము వాడుకొనుచుండగా, నీవు
ఇంకొకదరినుండి ఇంకను
క్రొత్తవి ఇచ్చుచునే యున్నావు. నీ దాన స్వభావమును ఎవరు
వర్ణింపగలరు? మా తెలివితక్కువవల్ల మేము వాటిని పూర్తిగా వాడలేకపోవుచున్నాము. నీ దానములు
అందుకొనుశక్తి నరులకందరకున్న యెడల అందరును ధనికులే. ఒక్కరైనను బీదవారుండరు. నీవు
కలుగజేసిన వాటిలో ఉపయోగములేనిది ఏదియులేదు. నా విషయమై నీకు ప్రతిదినము ఎంతో
ఖర్చున్నది. నీవు బిల్లు వేసినయెడల నేను ఇయ్యగలనా? ప్రతి నిమిష దానములనుబట్టి
నీకనేక వందనములు.
17).
నీవిచ్చిన అన్నిదానములకంటే ఓ తండ్రీ! నీవు నీ కుమారుని
పంపిన దానము గొప్పది,
అనంతమైనది. ఎందుకు నిన్ను స్తుతింపవలెనని కోరినయెడల ప్రతి
రెప్పపాటున స్తుతింపవలెను. నీ కుమారుని అవతార దానమునకు మించిన దానము లేనేలేదు. ఆ
దానమునుబట్టి నీకు స్తోత్రములు. నేను పాపవిసర్జన చేయవలెననియు, బాప్తిస్మము
పొందవలెననియు, రక్షణ అందుకొనవలెననియు,
సంస్కార భోజనము భుజింపవలెననియు, ఇతరుల
రక్షణార్ధమైన సేవ చేయవలెననియు,
నీ వాక్యగ్రంధమును మా హృదయములో అచ్చు వేయించుకొనవలెననియు, జీవాంతమందు
నీ సన్నిధికి వచ్చివేయవలెననియు నీవు కోరుచున్న కోరికకు ఏమి చెప్పగలను. నీ దానములు
లెక్కపెట్టుటకు కూర్చున్నయెడల మా దీర్ఘ జీవితకాలము చాలదు. మా విశ్వాసము, మా
గ్రహింపు, మా స్తుతి నీ దృష్టి యెదుట మిగుల స్వల్పమైనను నీవు అంగీకరించుట
ఆశ్చర్యముగానున్నది. ఏమి చెప్పగలను! ఏమి వివరింపగలను! ఎంత జాగ్రత్తగా స్తుతి
చేసినను ఎప్పుడు పూర్తిగా కుదరదు. అయినను నీవు ఆనందించుచున్నావు. నీకు స్తోత్రము.
నీ కుమారుని దానమునకు వెలుపల ఏ దానమును లేదు. నీవు చూపుచున్న కృప వెలుపల ఏ కృపయు
లేదు. సంఘముయొక్క వెలుపల రక్షణలేదు. నీ మహత్తు విషయమై నీకు లెక్కకు మించిన
స్తోత్రములు.
18).
నా జన్మము,
నా బ్రతుకు ఎంత పవిత్రముగానున్నను, మరణ
సమయమందు పరలోకమునకు నేను సిద్ధము కాని యెడల మా ఆయుస్సు అంతయు వ్యర్ధమే. ఒకవేళ నేను
మరణ సమయమునందు సిద్ధముగా నున్న యెడల మోక్ష ప్రవేశము కలిగించుకొనుటకు ధన్యత కలదు.
అంతకన్న మించిన అంతస్థు గల మరియొక ధన్యకాలము కలదు. ఆ కాలమునకు, ఆ
రెప్పపాటు కాలమునకు,
మా ప్రభువుయొక్క రెండవ రాకడకు నేను సిద్ధపడని యెడల భూమిమీద
శ్రమలు అనుభవించుటకు మిగిలిపోవుదును. నేను అంతకాలము భక్తిగా బ్రతికి, అన్నియు
నమ్మి రెండవరాకడను నమ్మకయు,
నమ్మినను సిద్దపడకయు నున్నయెడల నాకు ఎంత దౌర్భాగ్యత
దాపురించును? భక్తిగల జీవనము,
భక్తిగల మరణము సజీవుల గుంపులో చేరవలసిన ఆరోహణము, మా
యెదుట పెట్టియున్నావు గనుక నీకు స్తోత్రములు. లేనియెడల మా బ్రతుకువలన నీకు
ప్రయోజనమేమి? ఇట్టి ప్రయోజనములేని స్థితి నాకు రాకుండా చేయగల తండ్రీ! నీకు స్తోత్రము.
Comments
Post a Comment