Skip to main content

దైవలక్షణములు స్తుతి

                ఓ త్రియేక దేవుడవైన ప్రభువా! నీ దివ్యలక్షణములు మా జీవిత కాలముయొక్క ఉపయోగార్ధమై వాడుచున్నావు. గనుక నీకు స్తోత్రములు. నీ వెలుగు మాలో ప్రవేశపెట్టుచున్నావు. నీలోని జీవము మాలో ప్రవేశపెట్టుచున్నావు. నీలోని ప్రేమ మా విషయమై చూపించుచున్నావు. నీలోని శక్తి మా బలహీనత సమయములో చూపించుచున్నావు. నీలోని న్యాయముద్వారా మమ్మును తప్పుదారిలో నుండి తప్పించుటకు ప్రయత్నించుచున్నావు. నీలోని పరిశుద్ధతతో మమ్ములను పవిత్రపరచుచున్నావు. నీలోని నిరాకారముతో మాలోని విశ్వాసమును బలపరచుచున్నావు. నీలోని సర్వ సద్గుణముల నిమిత్తమై నీకు వందనములు. నీ సద్గుణములు మాలో ప్రవేశపెట్టుటకు నిత్యము ప్రయత్నించుచున్నావు. గనుక నీకు స్తోత్రములు. నీ అనాదిలో అనంతమున్నది. నీ అనంతములో ప్రేమ యున్నది. నీ ప్రేమలో న్యాయమున్నది. నీ న్యాయములో పరిశుద్ధతయున్నది. నీ పరిశుద్ధతలో శక్తియున్నది. నీ శక్తిలో నిరాకారమున్నది. నీ నిరాకారములో పత్యక్షతయున్నది. నీలోని ప్రతీ ఒక్క లక్షణములో అన్ని లక్షణములు ఇమిడి ఉన్నవి. ఒక్క లక్షణము మాలో పెట్టియున్నావు అని తలంచినప్పుడు తక్కినవి కూడ పెట్టియున్నావని మేము గ్రహించుకొనుచున్నాము. నీకు ఆదిలేదు అని మేము అనుకొన్నప్పుడు నీలోని అన్ని గుణములకు కూడ ఆది లేదు అని మేము గ్రహించుకొనుచున్నాము. నీకు అంతము లేదు అని మేము అనుకొన్నప్పుడు' నీలోని అన్ని గుణములకు కూడ అంతము లేదని మేము గ్రహించుకొనుచున్నాము. తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మను మేము ఎట్లు విడదీయలేమో అట్లే కలిసియున్న నీ గుణములను వేరుచేయలేము. ఒక్క లక్షణమును గురించి, మా మనస్సు లోనికి తలంపు వచ్చినయెడల లక్షణము లన్నియు దొంతిగా జ్ఞాపకమునకు వచ్చునని తెలుసుకొనుచున్నాము. నీకు ఎన్ని దివ్యలక్షణములున్నవో అవన్నియు సమానముగా నున్నవి. అవన్నియు మాలో శాశ్వతముగా నుండునట్లు ముద్రవేయగోరుచున్న నీకు అనేక స్తోత్రములు. అగ్ని జ్వాలలో ఒకటి వేడి, రెండవది వెలుగు, మూడవది ఆకారము- ఇవి ఎట్లు కలిసియున్నవో అట్లే తండ్రి, కుమారుడు, పరిశుద్దాత్మ అను దేవుడవైన నీవును ఉన్నావు. గనుక నీకు అనేక స్తోత్రములు జ్వాలలో నున్న మూడింటిలో ఒకటి తీసివేసిన తక్కిన రెండును ఆగిపోవును, తక్కిన రెంటిని కూడా మనము తీసివేసినట్లే. నీ దివ్య లక్షణములలో ఒకటి మాకు అక్కర లేదన్నయెడల తక్కిన లక్షణములన్నియు అక్కర లేదనట్లే. నీవు న్యాయమైన రీతిగా ఒకరిని శిక్షించినప్పుడు మా కిష్టముండదు. అలాగైనయెడల నీవు మమ్మును ప్రేమించునప్పుడు మాకు ఎందుకు ఇష్టముండవలెను? మా విమర్శ సరికాదు. నీ విమర్శ పవిత్రమైనది. కాబట్టి నీకు వందనములు. మాలో ఎవరు నీ గుణలక్షణములన్నియు సంపాదించుకొంటారో వారు నీయొద్దకు రాక మరి ఎవరియొద్దకు వెళ్ళుదురు!

ఓ దేవా! నీలోనున్న గుణములన్నియు మాలో స్థిరముగా నుండునట్లు కృప దయచేయుము. దయగల ప్రభువా! నీ గుణములన్నియు మేము మా ఇష్టము వచ్చినంత ధారాళముగా వాడుకొనునట్లు నీవు మాకు స్వతంత్ర లక్షణము కూడ అనుగ్రహించినావు. అన్నియు అనుగ్రహించి స్వతంత్రత ఒక్కటే అనుగ్రహింపనియెడల, అవన్నియు 'యిచ్చిన ప్రయోజనములేదు. కాబట్టి అదికూడ యిచ్చినందుకు నీకనేక వందనములు.

నీ లక్షణములన్నియు మాకనుగ్రహించినప్పుడు, మేము వాటిని అందుకొన్నప్పుడు అవన్నియు మాహృదయములలో దొంతర్లుగా అమర్చి పెట్టిన వెలుగువలె ఉండును. స్తోత్రములు.

Comments

Popular posts from this blog

దైవలక్షణముల స్తుతి (సంఘారాధనలోని స్తుతులు)

అనాది :- అనాది దేవా! సృష్టింపబడకుండ నీ యంతట నీవే ఉన్నావు , గనుక నీవు ముందే ఉండి , మా చరిత్ర అంతటిని చూచుచు మాకు కావలసినవన్నియు ముందే ఏర్పాటు చేసియున్నావు. గనుక నీకు మా వందనములు. అనంతము :- అనంత దేవా! నీవు ఎల్లప్పుడు ఉండువాడవు గనుక అంతములేని కాలము వరకు కావలసినవన్నియు మేము అనుభవించుటకై నీ అనంత సన్నిధిని మా కొరకై ఉంచిన నీకు స్తుతులు. ప్రేమ :- ప్రేమవైయున్న తండ్రీ! నీవు ముగ్గురుగా (త్రిత్వముగా) బయలు పడకపోయిన , మేము నిన్ను ప్రేమించుట ఉండదు. నీ ప్రేమ సృష్టి యంతటిలోను కనబడుచున్నది. మేము మా పిల్లలను ప్రేమించుటకన్న నీవు మమ్మును ప్రేమించుటయే ఎక్కువైయున్నది. మమ్మును కలుగజే సిన నీవు మమ్మును ప్రేమించక యింకేమి చేయుదువు! గనుక నీ ప్రేమను బట్టియే మానవునికి కావలసినవన్నియు ఆలోచించి చేసినావు. ఆ నీ ప్రేమనుబట్టియే సహించుచు , శిక్షించుచు , క్షమించుచున్నావు. మరియు అట్టి నీ ప్రేమను బట్టియే మా పాపములను జ్ఞాపకము చేసికొనను అన్నావు. గనుక నీకు వందనములు. పరిశుద్ధత :- పరిశుద్ధుడవైన జనకా! సర్వసృష్టిని , మానవుని , పరిశుద్ధముగానే చేసియున్నావు. పాపప్రవేశమును బట్టి మేము పాపులమైనను , నీ పరిశుద్ధతను బట్టి మరల మాకు పరి...

దైవలక్షణముల స్తుతి (సమర్పణ ప్రార్ధనలోని స్తుతులు)

  1. దేవా , తండ్రీ! నా నిమిత్తమై సమస్తమును కలుగజేసిన తండ్రీ! అనుదినము మాకు కావలసినవన్నియు అందించుచున్న తండ్రీ! నా ప్రియుడవైన తండ్రీ! నా దేవా , నా ప్రభువా! పోషకుడా , నా రక్షకుడా , నా సర్వమా! నీ కనేక నమస్కారములు. తండ్రీ! సృష్టి మూలముగ మాత్రమేగాక , నీ కుమారుని మూలముగ కూడ నన్ను నీ బిడ్డగా ఏర్పరచు కొన్నందులకై నీ కనేక వందనములు. నీ దానముల మూలముగాను , నీ సహింపు మూలముగాను , నీ నడిపింపు మూలముగాను , మా కష్టములు నివారణ చేయు నీ క్రియల మూలముగాను , నాకు నీవు చూపుచున్న ప్రేమను త లంచుకొని నిన్ను స్తుతించుచున్నాను. గాని నా స్తుతి నీ ప్రేమ యెదుట యేమాత్రము ? నా అంతరంగమందున్న కృతజ్ఞత నీ అనంత ప్రేమ యెదుట యేమాత్రము ? నేను ఏదియు ముట్టుకొనక స్తుతి మాత్రమే చేసినను అది సహితము నీ కనికరము యెదుట మిక్కిలి స్వల్పమై ఉండును. ఆ స్వల్ప స్తుతులను కూడ హస్తార్పణముగ అందుకొనుచున్నావు. గనుక నీకు వందనములు. నీవు నన్ను నేటివరకు కాపాడుచు , నడిపించుచు , వృద్ధిలోనికి తీసికొనివచ్చుచున్న నీ శక్తిని తలంచుకొని స్తుతించుచు , యిక ముందునకు కూడ నా విషయములో యిట్టి కార్యములు చేయుచుందువని నమ్ముచు నిన్ను స్తుతించుచున్నాను. నా జీవితాంతమందు ...

రెండు ద్వారములు, మత్తయి 6:33 - (యం. దేవదాసు అయ్యగారి ఉపదేశము.) తేది 12 — 10 — 1958

రెండు ద్వారములబడి దేవుని రాజ్యములోనికి, దేవుని సంఘము లోనికి రావలసినవారికి ఈ వాక్యమందు వర్తమానమున్నది. మన దేవాలయమునకున్నది ఒక ద్వారము. ఇక్కడ నిండి పోయినందువల్ల ఒక్కొక్క ఆదివారము వెనుక ద్వారము గుండా వచ్చి ఇక్కడ కూర్చుని వింటారు. వారుకూడా ఆరాధనలో పాల్గొంటారు. ఈ వాక్యమును విడదీసికొందాము. అందులో రెండు గొప్ప మాటలు ఉన్నాయి. (1) దేవుని రాజ్యము (2) ఆయన యొక్క నీతి దేవునియొక్క రాజ్యముగా దేవునియొక్క గవర్నమెంటు. ఈ గవర్నమెంటుకు ఆయనే రాజు. అయితే దేవుని రాజ్యమెక్కడ ఉన్నది ? మన హిందూ దేశము నేలే గవర్నమెంటు. రాజ్యము ఢిల్లీలో ఉన్నది. వారి రాజ్య ప్రవేశము హిమాలయమునుండి కన్యాకుమారి వరకు ఉన్నది. అలాగుననే దేవుని రాజ్యముకూడా నున్నది. ఇంగ్లండు దేశము వారికి వారి దేశమే వారి రాజ్యము. వారు ఇతర దేశములు కూడా గెలుచుకుంటే అది కూడా వారి రాజ్యమే. అలాగే జపాను వారున్నది జపాన్ రాజ్యము వారెక్కడైనా గెలుచుకుంటే అది వారి రాజ్యమే. అలాగుననే దేవునిరాజ్య మెక్కడ నున్నది ? అనేది ఒక గొప్ప ప్రశ్న. ప్రభువు 1. ఆయన రాజ్యమును వెదకమన్నారు. రాజ్య మెక్కడనున్నదో తెలియకపోతే ఎలాగు? ఎక్కడున్నదో చెప్పే వెనుకనున్నారు. మత్తయి 6 అధ్యాయములో...