విశ్వాస ప్రార్థన యొక్క లక్షణములు

 1. విశ్వాస సహితమైన ప్రార్ధన మనుష్యునికి శాశ్వత జీవనమును ఇచ్చును. దావీదు కీర్తనలు 1:2,3

2. విశ్వాస సహితమైన ప్రార్థన మనుష్యుని ఫలింపజేయును. కీర్తనలు. '2:8.

3. విశ్వాస సహితమైన ప్రార్థన పరమపురికి చేర్చు నావ వంటిది. ఆది. 6:9,14.

4. విశ్వాస సహితమైన ప్రార్థన పాలు తేనెల కంటె అధికమైన బలమిచ్చును. Daniel. 1:8-21.

5. విశ్వాస సహితమైన ప్రార్థన మనుష్యుని క్రీస్తునకు నిజ స్నేహితునిగా చేయును. ఆది. 18:16-33.

6. విశ్వాస సహితమైన ప్రార్థన మనుష్యుని దీనత్వము గలవానినిగా జేయును. Acts 7:57-60.

7. విశ్వాస సహితమైన ప్రార్ధన మనుష్యునికి తప్పక జవాబునిచ్చును. ఆది. 18:9-10,

8. విశ్వాస సహితమైన ప్రార్థన ప్రపంచమందున్న శక్తులన్నిటి కంటే బలమైనది. Acts 9:40,41.

9. విశ్వాస సహితమైన ప్రార్ధన లోకాధికారులకు భయమును, ఆశ్చర్యమును కలిగించును. అపో.కార్య. 5:19,24.

10. విశ్వాస సహితమైన ప్రార్ధన మనుష్యునకు రక్షణాస్పదము. రోమా. 10:13.

11. విశ్వాస సహితమైన ప్రార్ధన దుఃఖములో సంతోషమును కలిగించును. acts 16:23-25.

12. విశ్వాస సహితమైన ప్రార్ధన ఇహలోక అధికారుల పొరపాటులను దిద్దుటకు అధికారమును ఇచ్చును. మార్కు 6:17; 1రాజులు 21:17-24; 2 kings 1:15-16.

13. విశ్వాస సహితమైన ప్రార్ధనయే జనాంగములను ఎదిరించుటకు శక్తినిచ్చును. 1 kings 18:36-39.

14. విశ్వాస సహితమైన ప్రార్ధన కరవులో ఆహారము నిచ్చుటకు శక్తిగలది. 1 kings 17:15,16,

15. విశ్వాస సహితమైన ప్రార్ధన మనుష్యునికి నిజ పశ్చాత్తాపమును, మారుమనస్సును కలుగజేయును. లూకా. 22:60-62.

16. విశ్వాస సహితమైన ప్రార్ధన ప్రాపంచిక శ్రమలను యెడబాపుటకు అమోఘమైన సాధనమైయున్నది. ఆది. 39:1-10.

17. విశ్వాస సహితమైన ప్రార్థనయే దైవజనుని భక్తులయొద్దకు నడిపించును. Acts 10:17-33.

18. విశ్వాస సహితమైన ప్రార్థనయే ప్రజల దయను, అధికారుల దయను, దేవుని దయను సంపాదించుకొను ముఖ్య సాధనమైయున్నది. లూకా 2:52.

19. విశ్వాస సహితమైన ప్రార్థనయే మంచి యుద్ధము చేయుటకు బలమైన యుద్దోపకరణమై యున్నది. దానియేలు. 3:10-18.

20. విశ్వాస సహితమైన ప్రార్ధనయే మనుష్యుని పరలోకమందు జేర్చెడి నిచ్చెన. ప్రకటన. 4:1-3.

21. విశ్వాస సహితమైన ప్రార్థనయే, నరహత్య మొదలగు పాపముల నుండి పరిశుద్ధతకు మరలుటకు పునాదియై యున్నది. దానియేలు. 3:28-29.

22. అనుభవమైనచో, మన ప్రభువు నేర్పిన ప్రార్థనయే, పరమ పురికి మనలను ప్రవేశపెట్టు రాజమార్గము. మత్తయి 6:9-14.

23. విశ్వాసి ప్రార్థన జేయుచోట్ల సాతాను సంచారము చేయుచున్నాడు. యోబు. 1:7.

24. ప్రార్థన సలుపని విశ్వాసి హృదయము పెద్దపులులుండెడి గుహయును, మిడునాగులుండెడి పుట్టయునై యున్నది గనుక అట్టిదానిని మార్చుట కష్టతరము. 1రాజులు 21:7-16.

గనుక విశ్వాస ప్రార్థన సలుపుట ఈ కాలమందున్న విశ్వాసికి ఎంతో అవసరము. అన్ని స్థితులలో మనలను సంరక్షించి, అన్ని పరిస్థితులనుండి మనలను గట్టెక్కించగల సాధనము ఈ విశ్వాస ప్రార్థనయే. ఒక విశ్వాసి- అంతరంగ విశ్వాసిగాను, రాకడ విశ్వాసిగాను తయారగుటకు ఈ విశ్వాస ప్రార్ధనను అభ్యాసము చేసికొనవలెను. అనగా ఈ విశ్వాస ప్రార్థనయొక్క లక్షణములన్నియు తన అనుభవములో సంపాదించు కొనవలెను.

ఇట్టి స్థితిని పెండ్లికుమారుడైన క్రీస్తుప్రభువు చదువరులకు అందించి, విశ్వాస పూర్ణులనుగా చేసి ఆయన మహిమ రాకడకు ఆయత్తపరచుకొనును గాక! ఆమెన్.