నేత్రములు

నేత్రములు

అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొందియున్నామని నమ్ముడి; అప్పుడవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. —మార్కు 11 : 24.

(విశ్వాసము)

 1. విశ్వాసమునకు గుడ్డి తనమని చెప్పవచ్చును. ఎందుకనగా లేనివి, వున్న వనియూ, వున్నవి లేనివని గుడ్డిగా నమ్ముటయే విశ్వాసము. (విశ్వాసపు కన్ను అని కూడా పేరు)

 2. రానివి వచ్చుననియు, వచ్చునవి రావనియూ నమ్ముటయే విశ్వాసము.**

 3. నేత్రములు - నాలుగు.

   అవి (1) ఆత్మనేత్రము

   (2) మనోనేత్రము

   (3) విశ్వాస నేత్రము

   (4) శరీర నేత్రము

శరీర నేత్రము :- ఈ నేత్రము భూలోకమును, మేఘములను, నక్షత్రములను, సూర్యచంద్రాదులను చూడగలదు. మొత్తము మీద శరీర నేత్రము కొంతమట్టుకే చూడగలదు. అంతా చూసేది అదివేరు. ఇది మానవ నేత్రము గనుక మహిమను చూడలేదు. శరీర నేత్రము గనుక సర్వమును చూడలేదు. **ఈ నేత్రము తరచుగా పాపము తట్టు నీడ్వబడు చుండును. గనుక పవిత్రతను చూడజాలదు.** దీనిదృష్టి యంతయును ఇహలోకము తట్టు యుండును. ఈ నేత్రము నకు సాధ్యమైనవి. సాధ్యమైనవిగా కనబడును. అసాధ్యమైన విషయములను చూడశక్తి లేని నేత్రము.

విశ్వాస నేత్రము :- విశ్వామును నేత్ర మనవచ్చును. ఎందుచేతనంటే అన్నిటిని చూడగలదు. దీనికే దూరదృష్టి (దివ్యదృష్టి) కలదు. ఈ కంటికి అసాధ్యమైన విషయములు సాధ్యములుగా కనిపించును. ఇది లోక సంబంధులకు గ్రాహ్యముకాని నేత్రము. వారికి అర్థము కాని విషయము. వ్యాధిగా నున్న యెడలను, ఇంకాను రోగి బాధపడుచున్నను బాగుపడకముందే బాగుపడినట్టు, బాగుపడిన స్థితిని విశ్వాస నేత్రము చూడగలదు. లేమిలో యున్నప్పుడు కలిమిని చూడగలదు. దుఃఖముతో నున్నప్పుడు సంతోషము చూడగలదు. నిరాశలో నున్నప్పుడు నిరీక్షణను చూడగలదు. నిస్సహాయములో నున్నప్పుడు సహాయమును చూడగలదు. బాధలో నున్నప్పుడు స్వస్థతను చూడగలదు. బలహీనముగా నున్నప్పుడు బలమును చూడగలదు.

ఓ సహోదరుడా! విశ్వసించుట వేరు, విశ్వాసవరమునుకలిగి యుండుట వేరని గ్రహించుము. ఓ మిత్రుడా నిరీక్షణవేరు, విశ్వాసము వేరని గ్రహించుము. విశ్వసించుట సామాన్యమైన విషయము కాదు. అది అబ్బినట్లైతే కష్టమైన విషయముకాదు.

నిరీక్షణ అనగా ఒక సంగతినిగూర్చి ప్రార్థించకముందు నేను ప్రార్థిస్తాను, ప్రభువు వింటారు, అది నెరవేరుస్తారు అని నమ్ముట. ఇది విశ్వాసము కాదుకాని నిరీక్షణ యైయున్నది. ఒక సంగతిని గూర్చి ప్రార్థించిన తరువాత, నేను ప్రార్థించినాను. प्रभुవు నా ప్రార్థన విన్నారు. తప్పక నెరవేరుస్తారు అని నమ్ముట. ఇదియూ విశ్వాసము కాదు సుమా! ఇదియు నిరీక్షణయే. నిరీక్షించువారు ధన్యులు, వారు నిరీక్షణ ఫలము పొందుదురు. విశ్వాసము అనగా ఒక సంగతిని గూర్చి ప్రార్థించిన తరువాత ఆ ప్రార్థించిన విషయము జవాబు పొందని సమయమందు జవాబు వచ్చెను, ప్రార్థన నెరవేరెను అని పలుకుటయే విశ్వాసము. ఇది విశ్వాసపు పలుకు. విశ్వాసమనగా ఇదియే. విశ్వాసమును గూర్చి వివరించుట కష్టము.

ఉదాహరణ :- ఆకలి సమయమందు అన్నము పెట్టుకొని తింటిని. ఆకలి తీరెను. అంతలో ఒకరు వచ్చి అన్నము తింటిరా ? అని నన్ను అడిగిరి. నేను, ఔను తినుట ముగించితిని అని అంటిని. ఆకలి తీరెనా? అని ప్రశ్నించిరి. ఔను ఆకలి తీరెను అంటిని. ఎలాగు తీరెనని మరలా ప్రశ్నించిరి. తినుట వలన తీరెనని మరలా జవాబుయి స్తిని. అనగా నేమి ? అని మరలా ప్రశ్నించిరి. అనగానేమో తెలుసును గాని వివరించలేనని జవాబుయి స్తిని. ఆకలి తీరుట ఎరుగుదును, తీరు నదని చెప్పగలను, కాని వివరించుట తెలియదు.

విశ్వసించుట :- ప్రార్థించిన సమయమందు అనేకమైనవి (అపజయములు) కలుగును, అయిననూ విశ్వసించుట కొనసాగింపుము ముగింపులో సంపూర్ణ జయము చూడగలవు.**

ఓ స్నేహితుడా ! నీవునూ, నీ కుటుంబమును విశ్వాసము వలన జీవింపవలెనని (శరీరాత్మల విషయము) నీకున్న యెడల, నీవునూ, నీ కుటుంబమునూ దేవుని సన్నిధిలో మోకరించి, ప్రార్థించి విశ్వాసవరమును పొందుడి. అప్పుడు విశ్వాసమనగా నేమో గ్రహించుదువు. అప్పుడు అనుదినము విశ్వాసబ్రతుకులో అనేకమైన ఆశ్చర్యమైన సంగతులు చూడగలవు. విశ్వసించు వారు అనేకులు కలరు. విశ్వాసవరము కలవారు కొద్ది మందియే యున్నారు.

 1) నిన్ను గురించి నీవు నీ మీద ఆనుకొనకుము.

 2) నీ బంధువులను నమ్మి వారిమీద ఆనుకొనకుము.

 3) నీ స్నేహితులను నమ్మి వారిమీద ఆనుకొనకుము.

 4) నీ ఇరుగు-పొరుగు వారిని నమ్మి వారిమీద ఆనుకొనకుము.

 5) నీ పేటవారిని నమ్మి వారిమీద ఆనుకొనకుము.

 6) నీ ఊరివారిని నమ్మి వారిమీద ఆనుకొనకుము.

 7) నీ అధికారులను (రాజ్యాధికారులను, సంఘాధికారులను) నమ్మి వారిమీద ఆనుకొనకుము.

 8) నీ స్వంత మిషనును నమ్మి దానిమీద ఆనుకొనకుము.

 9) నీ మతమును నమ్మి దానిమీద ఆనుకొనకుము.

 10) నీ చందాలను నమ్మి వాటిమీద ఆనుకొనకుము.

 11) నీ జీతమును నమ్మి దానిమీద ఆనుకొనకుము.

 12) (నీకున్న) నీ పైనున్న ప్రజాభిమానమును నమ్మి దానిమీద ఆనుకొనకుము.

 13) నీ వృత్తిని నమ్మి దానిమీద ఆనుకొనకుము.

 14) నీ శరీర బలమును నమ్మి దానిమీద ఆనుకొనకుము.

 15) నీకున్న జ్ఞానమును నమ్మి దానిమీద ఆనుకొనకుము.

పరా :- 1. సహోదరుడా ! పైనున్న 15 (పదిహేను) విషయములన్నియూ నమ్ముటకు ఎంతనమ్మకము అవసరమో, అంతనమ్మకముతో ఒకసారిగా దేవునిని నమ్ముము. అప్పుడు నీవు నీ శరీరాత్మల విషయములలో తదితరులకంటే శ్రేష్టమైనవాడవుగా, జీవించుచూ దేవుని మహిమ చూడగలవు.

2. ఓ మిత్రుడా ! పైనున్న 15 (పదునైదు) విషయములన్నిటి మీద ఆనుకొనుటకు ఎంత శక్తి అవసరమో, అంత శక్తితో దేవుని మీద ఆనుకొనుము. ఆనుకొనుట, నమ్ముట అవసరము. ముందు నమ్ముము. నమ్మిన తర్వాత విశ్వాసవరమును గూర్చి ప్రార్థించుము. ప్రార్థన ముగించిన తరువాత అభ్యాసమును చేయుము. అటు తరువాత విశ్వాసములను గూర్చి ప్రశ్నలు ఏమైనాయున్న యెడల ప్రశ్నలడిగి జవాబులు పొందవచ్చును. నీవు పోయి ఈలాగు చేయుము.

3. దేవుడు నీకు దర్శనములోకానీ, స్వప్నములోకానీ కనబడి ననూ, కనబడక పోయిననూ ఈలాగు చేయుము. అప్పుడు నీవు దేవుని మహిమపరచుచూ వర్ధిల్లగలవు.

దేవుడు కనబడుట, కనబడకపోవుట అనునవి మన హృదయ స్థితినిబట్టి, అవసరమును బట్టి యుండును.

 “హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూతురు