Skip to main content

సమర్పణ ప్రార్థనా ప్రసంగము

సమర్పణ ప్రార్థనా ప్రసంగము

(ఇది సమర్పణ ప్రసంగము చేయునప్పుడు ఉపయోగముగా నుండును).

సమర్పణ:- శరీరము, ఆత్మ, జీవమును ఇంకను మనకు కలిగియున్నది సమర్పించవలయును.

ప్రార్థనమెట్లు: - సేవ, పరిచర్య, సమర్పణ చేయవలెను.

1) సమర్పణ అనగా నాకు కలిగియున్న యావత్తు నీ స్వాధీనము చేస్తున్నాను. 2) నాకు కలిగియున్నది నా ఇష్టమునుబట్టి వాడుకొనను. నీ ఇష్టమునుబట్టి వాడుకొందును. 3) నేను ఈ ప్రకారము చేసేటప్పుడు నాకు ఆటంకములు వచ్చును. ఆటంకములు, ఆపదలు వచ్చినా నీ చిత్త ప్రకారము చేస్తాను.

షరా:- మొదటి రెండు సుఖముగానున్నప్పుడు చేసిన తీర్మానములు. (1) ఆపదను బట్టి బాటసారి మంచి సమరయుడు చేసినదానంతటిని నమ్మతించును. గాయముకట్టనిచ్చెను. వాహనముమీద ఎక్కించునప్పుడు ఊరుకొనెను. పూటకూళ్ళవాని కప్పగించినప్పుడు ఊరుకొనెను. అదంతా చేయనిచ్చెను. ఆ విధముగానే మన విషయమై ప్రభువు ఏమి చేసినా ఊరుకొన్న యెడల ఆయన ఎంత ఉపకారమైన చేయును. (2) వారు నీ మాట వినరు. అయినప్పటికిని నీవు వెళ్ళి చెప్పవలెను అని దేవుడు యెహెజ్కేలుతో పలికెను. యెహెజ్కేలు దేవుని చిత్తమునకు సమర్పణ అయినాడు గనుక ఎదురు మాట చెప్పలేదు. వెళ్ళి వారికి బోధించినాడు. వినేవారలారా! మిమ్మును దేవుడు అటువంటి సువార్త అక్కరలేని స్థలమునకు పంపిస్తే వెళ్ళుదురా? (3) మీ సహోదరుని మీద నీకెప్పుడైన కష్టముంటే సమాధానపడు, అప్పుడు నీ దేవుని బలిపీఠమునొద్దకు రమ్ము అని ప్రభువు ఉపన్యాసములో సెలవిచ్చెను. ఇది కష్టమైన పని. చందావేయుట సుళువైన పనేగాని సమాధానపడుట సుళువైనపనియా? దేవుని వాక్యమిచ్చే సలహాకు సమర్పణ అయినవారు దేవుని వాక్యములో ఉన్నట్లు చెప్తారు. వారాలాగు చేయగలరా? (4) గార్ధభమును పేతురు, యోహానులు విప్పి తీసికొనివచ్చిరి. ప్రభువు చెప్పిన పని చేసినారు. 'మీరు ఫలాని చోటికి వెళ్ళి పలానా పని చేసిరండి' అని ప్రభువు మీతో తన వాక్యము ద్వారా చెప్పిన యెడల మీరు చేస్తారా? (5) ఆయన కోరినట్లు వారు చేసిరి. ప్రభువు యొక్క కోరికకు సమర్పణ అయినవారు తప్పక చేస్తారు. (6) 5వేల మందికి ఆహారము పెట్టకముందు శిష్యులు ప్రజలను బారులు తీరి కూర్చుండబెట్టవలసిందని ప్రభువు చెప్పెను. ఆ ప్రకారమే వారు చేసిరి. ఇందరకు సరిపోయే రొట్టెలు లేవు గనుక వచ్చిన తరువాత కూర్చుండబెట్టకూడదా? అని వారు ఎదురు చెప్పలేదు. చెప్పినట్లు చేసారు. అలాగే మీరును చేయగలరా? (7) ఒక స్త్రీ తనకున్నది యావత్తు చందా వేసెను. ఇది యూదుల నిబంధనలోని ప్రధమభాగము కంటే ఎక్కువ. అంతా వేయుమని ప్రభువు చెప్పకపోయినను వేసినది. ప్రభువు చెప్పకపోయినను మీ మనస్సాక్షికి తోచిన ఒక మంచి కార్యము మీరు చేయగలరా? చెప్పినదే చేయలేక పోవుచున్నాము. చెప్పనిది ఏ మాత్రము చేయగలమా? (8) పేతురు నీటిమీద నడువవలసిందని యేసుప్రభువు చెప్పెను. మునిగిపోవుదుననే భయము లేక పోయెను. ప్రభువు ఇచ్చిన సెలవు ప్రకారము చేయ ప్రయత్నించెను. తాను ప్రభువుయొక్క సమర్పణకు సమర్పణ ఆయెను. అందుచేత కొంతదూరమైన నడువగలిగెను. అసాధ్యమైన పనిని ప్రభువు చెప్పితే చేయ ప్రయత్నించెను. గాని భీతివలన పడిపోయెను. రక్షింపబడినందువలన మరలా ప్రయత్నించెను. ప్రభువు మనకు అసాధ్యమైన పని చెప్పినప్పుడు మనము చేయగలమా? (9) ప్రభువు ఒకనిని చూచి నన్ను వెంబడించుమని చెప్పెను. అతని దృష్టి తండ్రి సమాధి చేయుట మీదనున్నది. మన ఇష్టము ఒక అంశముమీద ఉన్నప్పుడును, ప్రభువుమీద నున్నప్పుడును, ప్రభువు వద్దని చెప్పితే ఆ అంశమును మానివేయగలమా? (10) ప్రభువు సువార్త పనిమీద 70మందిని పంపెను. ఇది సువార్తలలో ఎందుకు వ్రాయబడెను? మన బోధ నిమిత్తమే గదా! ప్రభువు మనలను పిలిచి, సువార్తకు వెళ్ళండని చెప్పారు. ఒక్కసారే చెప్పివేసెను. (11) యెఫ్తా న్యాయాధిపతి యుద్ధమునకు వెళ్ళి జయము పొంది తిరిగి వచ్చుచుండెను. అప్పుడు తన ఏకైక పుత్రికయగు కన్యక ఎదురు పడెను. అందుచేత తన మ్రొక్కుబడి ప్రకారము ఆమెను దేవునికి సమర్పణ చేయవలసి వచ్చినను సమర్పించి వేసెను. (కుమార్తెకూడా సమ్మతించెను). మీలో ఎవరి బిడ్డనైన దేవుని సేవకు ప్రత్యేకించి సమర్పణ చేయగలరా? (12) అబ్రాహాము దైవభయము గలవాడై తన ఏక పుత్రుని తన చేతులతో బలి చేయ నిశ్చయించుకొనెను. ఇది తల్లిదండ్రులైనవారు గ్రహించలేని గొప్ప సమస్య. ఇస్సాకుకూడా సమ్మతించుట ఆశ్చర్యమే. (13) యేసుప్రభువు ఒక మాట చెప్పెను. నా తండ్రి చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారము. ప్రియులారా! దేవుని చిత్తము నెరవేర్చుట మనకు కూడా అన్నము తిన్నట్లుగానే ఉండునా? 

Comments

Popular posts from this blog

దైవలక్షణముల స్తుతి (సంఘారాధనలోని స్తుతులు)

అనాది :- అనాది దేవా! సృష్టింపబడకుండ నీ యంతట నీవే ఉన్నావు , గనుక నీవు ముందే ఉండి , మా చరిత్ర అంతటిని చూచుచు మాకు కావలసినవన్నియు ముందే ఏర్పాటు చేసియున్నావు. గనుక నీకు మా వందనములు. అనంతము :- అనంత దేవా! నీవు ఎల్లప్పుడు ఉండువాడవు గనుక అంతములేని కాలము వరకు కావలసినవన్నియు మేము అనుభవించుటకై నీ అనంత సన్నిధిని మా కొరకై ఉంచిన నీకు స్తుతులు. ప్రేమ :- ప్రేమవైయున్న తండ్రీ! నీవు ముగ్గురుగా (త్రిత్వముగా) బయలు పడకపోయిన , మేము నిన్ను ప్రేమించుట ఉండదు. నీ ప్రేమ సృష్టి యంతటిలోను కనబడుచున్నది. మేము మా పిల్లలను ప్రేమించుటకన్న నీవు మమ్మును ప్రేమించుటయే ఎక్కువైయున్నది. మమ్మును కలుగజే సిన నీవు మమ్మును ప్రేమించక యింకేమి చేయుదువు! గనుక నీ ప్రేమను బట్టియే మానవునికి కావలసినవన్నియు ఆలోచించి చేసినావు. ఆ నీ ప్రేమనుబట్టియే సహించుచు , శిక్షించుచు , క్షమించుచున్నావు. మరియు అట్టి నీ ప్రేమను బట్టియే మా పాపములను జ్ఞాపకము చేసికొనను అన్నావు. గనుక నీకు వందనములు. పరిశుద్ధత :- పరిశుద్ధుడవైన జనకా! సర్వసృష్టిని , మానవుని , పరిశుద్ధముగానే చేసియున్నావు. పాపప్రవేశమును బట్టి మేము పాపులమైనను , నీ పరిశుద్ధతను బట్టి మరల మాకు పరి...

దైవలక్షణముల స్తుతి (సమర్పణ ప్రార్ధనలోని స్తుతులు)

  1. దేవా , తండ్రీ! నా నిమిత్తమై సమస్తమును కలుగజేసిన తండ్రీ! అనుదినము మాకు కావలసినవన్నియు అందించుచున్న తండ్రీ! నా ప్రియుడవైన తండ్రీ! నా దేవా , నా ప్రభువా! పోషకుడా , నా రక్షకుడా , నా సర్వమా! నీ కనేక నమస్కారములు. తండ్రీ! సృష్టి మూలముగ మాత్రమేగాక , నీ కుమారుని మూలముగ కూడ నన్ను నీ బిడ్డగా ఏర్పరచు కొన్నందులకై నీ కనేక వందనములు. నీ దానముల మూలముగాను , నీ సహింపు మూలముగాను , నీ నడిపింపు మూలముగాను , మా కష్టములు నివారణ చేయు నీ క్రియల మూలముగాను , నాకు నీవు చూపుచున్న ప్రేమను త లంచుకొని నిన్ను స్తుతించుచున్నాను. గాని నా స్తుతి నీ ప్రేమ యెదుట యేమాత్రము ? నా అంతరంగమందున్న కృతజ్ఞత నీ అనంత ప్రేమ యెదుట యేమాత్రము ? నేను ఏదియు ముట్టుకొనక స్తుతి మాత్రమే చేసినను అది సహితము నీ కనికరము యెదుట మిక్కిలి స్వల్పమై ఉండును. ఆ స్వల్ప స్తుతులను కూడ హస్తార్పణముగ అందుకొనుచున్నావు. గనుక నీకు వందనములు. నీవు నన్ను నేటివరకు కాపాడుచు , నడిపించుచు , వృద్ధిలోనికి తీసికొనివచ్చుచున్న నీ శక్తిని తలంచుకొని స్తుతించుచు , యిక ముందునకు కూడ నా విషయములో యిట్టి కార్యములు చేయుచుందువని నమ్ముచు నిన్ను స్తుతించుచున్నాను. నా జీవితాంతమందు ...

రెండు ద్వారములు, మత్తయి 6:33 - (యం. దేవదాసు అయ్యగారి ఉపదేశము.) తేది 12 — 10 — 1958

రెండు ద్వారములబడి దేవుని రాజ్యములోనికి, దేవుని సంఘము లోనికి రావలసినవారికి ఈ వాక్యమందు వర్తమానమున్నది. మన దేవాలయమునకున్నది ఒక ద్వారము. ఇక్కడ నిండి పోయినందువల్ల ఒక్కొక్క ఆదివారము వెనుక ద్వారము గుండా వచ్చి ఇక్కడ కూర్చుని వింటారు. వారుకూడా ఆరాధనలో పాల్గొంటారు. ఈ వాక్యమును విడదీసికొందాము. అందులో రెండు గొప్ప మాటలు ఉన్నాయి. (1) దేవుని రాజ్యము (2) ఆయన యొక్క నీతి దేవునియొక్క రాజ్యముగా దేవునియొక్క గవర్నమెంటు. ఈ గవర్నమెంటుకు ఆయనే రాజు. అయితే దేవుని రాజ్యమెక్కడ ఉన్నది ? మన హిందూ దేశము నేలే గవర్నమెంటు. రాజ్యము ఢిల్లీలో ఉన్నది. వారి రాజ్య ప్రవేశము హిమాలయమునుండి కన్యాకుమారి వరకు ఉన్నది. అలాగుననే దేవుని రాజ్యముకూడా నున్నది. ఇంగ్లండు దేశము వారికి వారి దేశమే వారి రాజ్యము. వారు ఇతర దేశములు కూడా గెలుచుకుంటే అది కూడా వారి రాజ్యమే. అలాగే జపాను వారున్నది జపాన్ రాజ్యము వారెక్కడైనా గెలుచుకుంటే అది వారి రాజ్యమే. అలాగుననే దేవునిరాజ్య మెక్కడ నున్నది ? అనేది ఒక గొప్ప ప్రశ్న. ప్రభువు 1. ఆయన రాజ్యమును వెదకమన్నారు. రాజ్య మెక్కడనున్నదో తెలియకపోతే ఎలాగు? ఎక్కడున్నదో చెప్పే వెనుకనున్నారు. మత్తయి 6 అధ్యాయములో...