Skip to main content

సమర్పణ- .Judges 11:29.

 ప్రార్థన:- ఈ దిన కార్యక్రమమంతటిని దీవించుము. నీవు దేవుడవు. మేము మనుష్యులము. నీ సంగతులను మేము గ్రహించలేము. అయినను నీవు తెలియజేయుచున్నందుకు స్తోత్రములు. వర్తమానమును నిన్న ఇచ్చినావు. స్తోత్రములు. ఈ వేళ ఇవ్వనైయున్నావు స్తోత్రములు. మేము నీ చిత్తమునకు బంధింపబడే వర్తమానమిమ్ము. మీరు నోవహును ఓడ కట్టమన్నారు అతడేమియు ప్రశ్నవేయకుండగా గొప్ప అద్భుతము జరిగింది. ఎందుకంటే ప్రశ్నలు వేయకుండ నీవు చెప్పినట్టు చేసినాడు. గనుక అది జరిగింది. ఎంత గొప్ప విధేయత. భక్తి అనగా అదే. మాకుకూడా అట్టిది దయచేయుము.

గోఫెరు కర్రతో అతడు కట్టిన నావ నీ కుమారునితో కట్టిన సంఘమునకు ముంగుర్తు. అట్టి విధేయత స్థితి మాకు దయచేయుము. నీవు చెప్పినట్లు కర్రతో కట్టాడు. గొప్ప పేరు వచ్చింది. కర్రతో కట్టిన నావకు, భక్తులతో నీవు కట్టిన సంఘ ఓడకు ముంగుర్తు అనేపేరు వచ్చింది. మనుష్యులు తప్పు చేస్తే మాత్రము అంత శిక్షా ప్రభువా! అనే మొదలైన ప్రశ్నలేమి వేయక నీవు ఆజ్ఞాపించినట్లు చేసాడు గనుక నీయందు విశ్వాసముంచిన మనుష్యులతో కట్టబడిన సంఘము, ఓడకు ముంగుర్తు అను పేరు వచ్చినది. ఆ కర్ర ఓడ ఏ మాత్రము. ఒక్క ఆర్మీ ఆ దేశములోనిది మాత్రమే గనుక అది అంత గొప్పదికాదు. నీవు కట్టే ఓడ భూలోకమంతటికి సంబంధించిన సంఘమనే ఓడకు ముంగుర్తు అయ్యేటంత ఘనత వచ్చినది. ఎందుకంటే ఆయన తన్నుతాను నీ ఆజ్ఞకు ఆపాదించుకొన్నాడు. మేమును అట్లే మా చిత్తమును నీ చిత్తమునకు బంధించే సమర్పణ మాకు దయచేయుము.

కర్రతో కట్టబడక సజీవులైన మనుష్యులతో కట్టబడిన నావకు ముంగుర్తుగానుండే గొప్ప స్థితియే దాని స్థితి. ఓడ కాలాల ప్రకారము కట్టుట, ఎన్నడు జరుగని ప్రవాహమును సహించి ఓడ కట్టెను. అది నీవు చెప్పినట్లు చేయుటలో ఉన్నది. మేముకూడ నీవుచెప్పిన దానికి ఎదురు చెప్పకుండా లోబడే కృప దయచేయుము. నోవహు ప్రత్యక్షత గొప్పది. ఎందుచేత? అతని హృదయ పరిశుద్ధత అంత గొప్పది. ఒక మనిషి మనిషితో చెప్పినట్లు చెప్పినావు. నీ ఆజ్ఞ ప్రకారము అతడు చేసినాడు. గనుక నీ చిత్త ప్రకారం సమర్పణ కావాలి.

నీ చిత్తము చూచి చిత్తము ప్రభువా! అనే సమర్పణ మాకిమ్ము. మేమైతే ఎన్నో ప్రశ్నలు వేసియుందుము. నోవహు ఓడ ఎంత గొప్పదంటే సంఘ ఓడకు పోలికగా ఉండేటంత గొప్పది. ఎవరు నీ చిత్తమునకు ఎదురు చెప్పరో, ప్రశ్న వేయరో వారికి నీ మర్మము బైలుపర్చుదువు. తన చిత్తమును బంధించి, చిత్తము ప్రభువా! అని నీ చిత్తమునకు ఒప్పచెప్పుకున్నాడు. మాస్టరు పిల్లలకు చెప్పినట్లు నీవు నోవహుకు డిక్టేటు చేయగా లేక డ్రాయింగు వేయమనగా వెంటనే చేసెను. పిల్లలైతే ఇంకొకసారి చెప్పమందురు. నోవహు అట్లు అడుగలేదు. ఈ మధ్య ఆ ఓడ నేటికాల ప్రజలకు బైలుపడినది. ముంచే వానవచ్చి నోవహు ఓడను తేల్చే. ఓడ అయింది. ఎందుచేతనంటే నీవు చెప్పినట్లు చేసినాడు. నీ ఆజ్ఞ దుర్జనులను ముంచును. సజ్జనులను తేల్చును. నీవు (నోవహు) అతనిని కట్టినావు. గనుకఅతడు ఓడ కట్టినాడు. నీవు చెప్పినట్లు చేస్తే గొప్ప అద్భుతములు ఈ వేళకూడా జరుగును. అతడు నీవు చెప్పగా నీ చిత్తము ప్రభువా! అనగానే ఎంతో అద్భుతము జరిగెను. మేముకూడా నీవు చెప్పినట్లు చేసే కృప దయచేయుము.

 ఉపాధ్యాయుడు పిల్లవానిని కూర్చోబెట్టి డ్రాయింగు ఇక్కడనుండి ఇక్కడకు ఇది ఇక్కడ ఇది, అని ఎట్లు చెప్పునో అట్లే నీవు ముఖాముఖిగా.. నీవు చేయించినావు. ఎందుచేతనంటే నీవు చెప్పినట్లు చేస్తాడు. ఆదికాండములో ఒక చిన్న వాక్యమున్నది. దేవుడు చెప్పినట్లు నోవహు చేసెను. గనుక (Certificate) ఇచ్చినావు. అట్టి సర్టిఫికెట్ మాకు కూడా ఇమ్ము. వెర్రిబాగులవానివలె ప్రశ్నలు వేయకుండా చెప్పినట్లు చేసాడు. మా గదిలో నోవహువలె ఎవరికి ప్రత్యక్షత కావలెనో అట్టివారికి ఈ పాఠమే గొప్పది. నోవహు వంటి విధేయత మాకుకూడా దయచేయుము. తెలుసుకొనుటకైనా ప్రశ్నలు వేయలేదు. ఎంత గొప్ప విధేయత. అబ్రాహామైన వేశారు. 50మంది ఉంటే నాశనము చేస్తావా? ఆ జనుడే దైవజనుడు. ఎంత ఘనుడు! నోవహు మాతో ఎవరికైనా నీవేమైనా చెప్పితే ఎన్నో ప్రశ్నలు వేయుదుము. నీవు చెప్పినట్లు నోవహు చేశాడు. కనుక తన కుటుంబాన్ని సృష్టినికూడా రక్షించాడు. అట్టి కృప మాకును దయచేయుము. కర్ర నావ గొప్పదా? వెర్రివాడైన నోవహు గొప్పవాడా? అని ప్రశ్నవేస్తే సమర్పణ. మన దేశములోనున్న చితిసారకపు కర్రతో సమానమని తెలుగు బైబిలులో చితిసారకపు కర్ర అనేయున్నది. మన ఆలోచన వేరు. దైవాజ్ఞవేరు. ప్రభువే అన్ని రకములుగా మనకు ప్రత్యక్షపరచగలరు.

ప్రత్యక్షతలు:-

1) దర్శనము:- దర్శనము కావలసివస్తే ఆయన చెప్పినట్లు

2) స్వరము వినవలెను:- ఆలాగైతే ఆయన చెప్పినట్లు చేయండి. నా గొర్రె నా స్వరము వినును'.

3) వ్రాత: వ్రాత కావలెనా ఆయన చెప్పినట్లు చేయండి. ముందు వాక్యములో ఉన్నట్టు చేయండి. అప్పుడు నేను చెప్పుతాను.

4) స్వప్నము:- స్వప్నముద్వారా దేవుడు తన చిత్తము బైలుపర్చును.

5) ఉపప్రత్యక్షత: - ఆయన చెప్పినట్లు చేస్తే అది దేనిదో దేవునిదో, సాతానుదో, స్వంతదో తెలియును. దేవుడు చెప్పినదానికి ఇంకేమియు ప్రశ్నలుండరాదు. ఉంటే అవి ఒక్క దేవుడు చెప్పిన వాటన్నిటికి వ్యతిరేకమైనవన్ని సాతాను చేయును. ప్రభువు చేసిన దానికి వ్యతిరేకముగా దయ్యము చెప్పితే తండ్రినడుగవచ్చును.

Comments

Popular posts from this blog

దైవలక్షణముల స్తుతి (సంఘారాధనలోని స్తుతులు)

అనాది :- అనాది దేవా! సృష్టింపబడకుండ నీ యంతట నీవే ఉన్నావు , గనుక నీవు ముందే ఉండి , మా చరిత్ర అంతటిని చూచుచు మాకు కావలసినవన్నియు ముందే ఏర్పాటు చేసియున్నావు. గనుక నీకు మా వందనములు. అనంతము :- అనంత దేవా! నీవు ఎల్లప్పుడు ఉండువాడవు గనుక అంతములేని కాలము వరకు కావలసినవన్నియు మేము అనుభవించుటకై నీ అనంత సన్నిధిని మా కొరకై ఉంచిన నీకు స్తుతులు. ప్రేమ :- ప్రేమవైయున్న తండ్రీ! నీవు ముగ్గురుగా (త్రిత్వముగా) బయలు పడకపోయిన , మేము నిన్ను ప్రేమించుట ఉండదు. నీ ప్రేమ సృష్టి యంతటిలోను కనబడుచున్నది. మేము మా పిల్లలను ప్రేమించుటకన్న నీవు మమ్మును ప్రేమించుటయే ఎక్కువైయున్నది. మమ్మును కలుగజే సిన నీవు మమ్మును ప్రేమించక యింకేమి చేయుదువు! గనుక నీ ప్రేమను బట్టియే మానవునికి కావలసినవన్నియు ఆలోచించి చేసినావు. ఆ నీ ప్రేమనుబట్టియే సహించుచు , శిక్షించుచు , క్షమించుచున్నావు. మరియు అట్టి నీ ప్రేమను బట్టియే మా పాపములను జ్ఞాపకము చేసికొనను అన్నావు. గనుక నీకు వందనములు. పరిశుద్ధత :- పరిశుద్ధుడవైన జనకా! సర్వసృష్టిని , మానవుని , పరిశుద్ధముగానే చేసియున్నావు. పాపప్రవేశమును బట్టి మేము పాపులమైనను , నీ పరిశుద్ధతను బట్టి మరల మాకు పరి...

దైవలక్షణముల స్తుతి (సమర్పణ ప్రార్ధనలోని స్తుతులు)

  1. దేవా , తండ్రీ! నా నిమిత్తమై సమస్తమును కలుగజేసిన తండ్రీ! అనుదినము మాకు కావలసినవన్నియు అందించుచున్న తండ్రీ! నా ప్రియుడవైన తండ్రీ! నా దేవా , నా ప్రభువా! పోషకుడా , నా రక్షకుడా , నా సర్వమా! నీ కనేక నమస్కారములు. తండ్రీ! సృష్టి మూలముగ మాత్రమేగాక , నీ కుమారుని మూలముగ కూడ నన్ను నీ బిడ్డగా ఏర్పరచు కొన్నందులకై నీ కనేక వందనములు. నీ దానముల మూలముగాను , నీ సహింపు మూలముగాను , నీ నడిపింపు మూలముగాను , మా కష్టములు నివారణ చేయు నీ క్రియల మూలముగాను , నాకు నీవు చూపుచున్న ప్రేమను త లంచుకొని నిన్ను స్తుతించుచున్నాను. గాని నా స్తుతి నీ ప్రేమ యెదుట యేమాత్రము ? నా అంతరంగమందున్న కృతజ్ఞత నీ అనంత ప్రేమ యెదుట యేమాత్రము ? నేను ఏదియు ముట్టుకొనక స్తుతి మాత్రమే చేసినను అది సహితము నీ కనికరము యెదుట మిక్కిలి స్వల్పమై ఉండును. ఆ స్వల్ప స్తుతులను కూడ హస్తార్పణముగ అందుకొనుచున్నావు. గనుక నీకు వందనములు. నీవు నన్ను నేటివరకు కాపాడుచు , నడిపించుచు , వృద్ధిలోనికి తీసికొనివచ్చుచున్న నీ శక్తిని తలంచుకొని స్తుతించుచు , యిక ముందునకు కూడ నా విషయములో యిట్టి కార్యములు చేయుచుందువని నమ్ముచు నిన్ను స్తుతించుచున్నాను. నా జీవితాంతమందు ...

రెండు ద్వారములు, మత్తయి 6:33 - (యం. దేవదాసు అయ్యగారి ఉపదేశము.) తేది 12 — 10 — 1958

రెండు ద్వారములబడి దేవుని రాజ్యములోనికి, దేవుని సంఘము లోనికి రావలసినవారికి ఈ వాక్యమందు వర్తమానమున్నది. మన దేవాలయమునకున్నది ఒక ద్వారము. ఇక్కడ నిండి పోయినందువల్ల ఒక్కొక్క ఆదివారము వెనుక ద్వారము గుండా వచ్చి ఇక్కడ కూర్చుని వింటారు. వారుకూడా ఆరాధనలో పాల్గొంటారు. ఈ వాక్యమును విడదీసికొందాము. అందులో రెండు గొప్ప మాటలు ఉన్నాయి. (1) దేవుని రాజ్యము (2) ఆయన యొక్క నీతి దేవునియొక్క రాజ్యముగా దేవునియొక్క గవర్నమెంటు. ఈ గవర్నమెంటుకు ఆయనే రాజు. అయితే దేవుని రాజ్యమెక్కడ ఉన్నది ? మన హిందూ దేశము నేలే గవర్నమెంటు. రాజ్యము ఢిల్లీలో ఉన్నది. వారి రాజ్య ప్రవేశము హిమాలయమునుండి కన్యాకుమారి వరకు ఉన్నది. అలాగుననే దేవుని రాజ్యముకూడా నున్నది. ఇంగ్లండు దేశము వారికి వారి దేశమే వారి రాజ్యము. వారు ఇతర దేశములు కూడా గెలుచుకుంటే అది కూడా వారి రాజ్యమే. అలాగే జపాను వారున్నది జపాన్ రాజ్యము వారెక్కడైనా గెలుచుకుంటే అది వారి రాజ్యమే. అలాగుననే దేవునిరాజ్య మెక్కడ నున్నది ? అనేది ఒక గొప్ప ప్రశ్న. ప్రభువు 1. ఆయన రాజ్యమును వెదకమన్నారు. రాజ్య మెక్కడనున్నదో తెలియకపోతే ఎలాగు? ఎక్కడున్నదో చెప్పే వెనుకనున్నారు. మత్తయి 6 అధ్యాయములో...