స్తుతిప్రార్థన

 


స్తుతిప్రార్థన

యెషయ 33 : 15-17 : యోహాను 2 : 1 ఎఫెస్సు 3 : 13

తండ్రి అనుగ్రహించిన దానములన్నింటిలోను ముఖ్యమైన దానము వాక్య దానమే.

నెహెమ్యా - ఎజ్రా 9వ అధ్యాయం స్తుతిప్రార్థన

(1)పాపము లొప్పుకొనుట | యూదా జనాంగము, వారి పితరులు పాపము చేస్తే తప్పించినావు అని ఒప్పుకొనిరి.

(2) ప్రార్థన |

(3) కృతజ్ఞత | స్తుతి అనగా తండ్రియొక్క లక్షణములెత్తి స్తుతించుట.

(4) స్తుతి |

యూదా జనాంగము యొక్క చరిత్ర కృతజ్ఞత :- అనగా తండ్రి మనకు చేసిన ఉపకారములను తలంచుకుని కృతజ్ఞత చూపుట

యూదా జనాంగము :- (1) ఆజ్ఞలు పొందిన జనాంగము. (2) ఏర్పాటు జనాంగము (3) ఆజ్ఞలు మీరిన జనాంగము (4) పాపములు తెలిసికొని మొర్రపెట్టిన జనాంగము (5) రక్షణ జనాంగము (6) నడిపించిన జనాంగము.

ఉదా :- తల్లి చిన్నపిల్ల వానిని మార్గమున నడువని సమయమున గద్దించి, లేవనెత్తి దారి పొడుగునను నడిపించును. అదే విధముగా పరలోకపు తండ్రి తన ఏర్పాటు జనాంగమును నడిపించును. నెహెమ్యా 9వ అధ్యాయంలో చూస్తే యూదా జనాంగమంతయు యెరుషలేములో కూడుకొని అందరు ఆలోచించుకొన్నారు. ప్రార్థన కూడా అల్లుకున్నారు. ఇందులో మొదటి కథ అన్యులతో కలిసిపోయిన సంగతి జ్ఞాపకము తెచ్చుకొని అన్య జనాంగముతోనున్న పొత్తు బొత్తిగా మానుకొనిరి.

యూదా జనాంగమునకు విచారకరమైన సంగతి అన్యులతో కలిసి యుండుట అయితే ఈ సమయములో పూర్తిగా మానుకొనిరి. ఇది సంతోషకరమైనది. అట్లే ఈ కాలములోను దేవునికి విరోధులైన వారితో విశ్వాసులు వేరుగా ఉండవలెను. యూదులు దైవాజ్ఞలన్నియు మీరిరి. గాని ఈ దినమునందు అన్యజనులతోనున్న పొత్తు విడిచిపెట్టినందున అంతరంగములో విచారము, మార్పు.. బహిరంగముగా గోనెపట్ట కట్టుకుని తలమీద ధూళిపోసుకొనిరి. యూదా జనాంగమునకు మూలపురుషుడు అబ్రాహాము ఈయన సొదమ గొమొర్రల నాశన సమయములో నేను ధూళిని - బూడిదను అని తగ్గించుకొని ప్రార్థించెను. ఆ లక్షణమే అనేక తరముల తరువాత వచ్చిన వీరిలోకి వచ్చెను. ఎజ్రా నెహెమ్యా కాలము వరకు వచ్చెను. అట్లే మన ఆది సంఘ ఆచారములు మంచివి ఇంకా ఉన్నవి. అబ్రాహములో అంత మంచి ప్రార్థన, వినయముండుటను బట్టి ఈ దినమందు యూదులు చేయగలిగిరి. అదే విధముగా తల్లిదండ్రులు చేయు మంచి పనులన్నియు పిల్లలైనవారు పెద్దలైనవారు చేయుదురు. పాపపు ఒప్పుదల పాతనిబంధన బహిరంగ ఆచారము గాని బూడిద, ధూళిపోసుకొనుట ఇది క్రొత్తనిబంధన అంతరంగ మారుమనస్సు తండ్రి సన్నిధిలో మోకరించి పాపములు కన్నీళ్లతో ఒప్పుకొనుట అయివున్నది.

స్తుతి :- ఆత్మ జీవితములో కలిగినమేళ్ళు తండ్రి లక్షణములు ఎత్తి స్తుతిచేయుదురు. గాని ఈ దినమందు యూదా జనాంగము స్తుతి పై స్తుతుల కంటే ముఖ్యమైనది. ఈ స్తుతులన్నింటి కంటే నీ నామమే గొప్పది. మా స్తుతుల కంటే నీ నామమే మించిపోయినది. అని చెప్పి ఆనందముతో స్తుతించిరి. మేళ్ళు మూలముగా స్తుతి.

మేళ్ళు రెండురకములు (1) బాధకముల నుండి తప్పించినావు (2) ఉపకారములు చేసినావు. ఆత్మ జీవితములోను రెండు మేళ్ళు (1) శ్రమలు తప్పించుట (2) శ్రమలులేనప్పుడు ఆత్మ జీవితమును వృద్ధిచేయుట.

ఇన్ని మేళ్ళు తలంచుకొని. ఈ స్తుతులన్నింటి కంటే నీ నామమే గొప్పది, అని స్తుతించిరి. యూదా జనాంగము చేసిన స్తుతికి ఒక నిరీక్షణ యున్నది.. లోకమునకు రక్షకుడు వస్తాడని మా యూదా జనాంగములో పుడతాడని తలంచి వందలాది స్తుతులు చేసిరి యూదులు; అయితే క్రొత్తనిబంధన స్తుతులు మరింత గొప్పస్తుతులై యుండవలెను. ఎందుకనగా వారి స్తుతి నిరీక్షణ, వారి స్తుతే గొప్పది. గనుక యూదుల స్తుతికంటే, విశ్వాసుల స్తుతికంటే, మా స్తుతుల కంటే నీ నామమే గొప్పది. మేము నీ నామమునకు తగిన స్తుతులు చేయలేమని స్తుతించవలెను.

పాత నిబంధన జనాంగమైన యూదులు పితరుల పాపములు, వారి పాపములు క్షమించమని ప్రార్థించిరి. వీరిని శ్రమలనుండి విడిపించెను. పాపములనుండి విడిపించెను, అదే విధముగా క్రొత్తనిబంధన జనాంగమునకు మీ పాపములు జ్ఞాపకము తెచ్చుకొనననియు, శిక్షించననియు దేవుడు చెప్పెను. ఇది ఎప్పటికైనా నెరవేర్చే 

ఓ దేవా : మా పితరులకు అరణ్యములో (1) 40 సం॥లు ఆహార మిచ్చినావు. (2) బండలో నీళ్ళిచ్చినావు. (3) కాళ్ళువాచలేదు. (4) బట్టలు మాయలేదు. ఇట్టి ఏర్పాటు జనము, అవిశ్వాసులైన మిశ్రమ జనమునకు ఇన్ని మేళ్ళుచేసెను. ఇక్కడ తండ్రి యొక్క సార్వత్రిక ప్రేమ (Universal Love) కనబడును. పాతనిబంధనలో ఒక జనాంగమున్నది. క్రొత్త నిబంధనలో అనేక జనాంగములలో నుండి వచ్చిన సంఘమున్నది. యూదులు తండ్రికి చిన్న పిల్లలు గనుక ఇన్ని పనులు చేసెను. క్రొత్త నిబంధన సంఘము పెద్దవారు నెరవేర్పు చూచినవారు. గనుక యేసుప్రభువు ఆత్మ ఆహారము. ఆత్మరీతిగా తమ శరీర రక్తమునకు ఆహారముగా ఏర్పరచెను. పాతనిబంధన ప్రజలకు ఇచ్చిన ఆహారముకంటే మనకిచ్చిన ఆత్మీయ శరీర ఆహారము, రక్తమును పానీయముగాను, నీతి వస్త్రమును ఇచ్చెను. ఇదో గొప్ప ఆత్మీయ శరీరాహారములు వారి మన్నా, నీరు, బట్టలు మాయ లేదు గదా : అట్లే క్రొత్త నిబంధన ఆశీర్వాదములు అనే యేసు శరీర రక్తములు, వస్త్రములు మరింత గొప్పవి. ఇది తలంచి మరింత స్తుతి చేయవలెను. ఐగుప్తు జనాంగమునకు మించి చేయవలెను. ఇశ్రాయేలీయులను శత్రువులు తరుమ గలిగిరి. గాని హాని చేయలేదు. అట్లే మనలను శత్రువులు తరుమ గలుగుదురుగాని ఆత్మీయ జీవనమునకు హాని చేయలేరు. పాత నిబంధనలోను, నిర్గమ కాండములోను, ఈ ప్రార్థనలోను శత్రువులు నాశనమైరి. మరలా కనబడలేదు. అని వ్రాయబడియున్నది. ఇశ్రాయేలీయులను చూస్తే వారికి అడ్డముగా వచ్చిన జనాంగమును నాశనము చేసిరి. గాని క్రొత్త నిబంధనలో చూస్తే యేసుప్రభువు సాతాను క్రియలను నాశనము చేయుటకు వచ్చెనని వ్రాయబడి యున్నది. ఏలాగునా ? ఒక రాయి నీటిలో వేస్తే మరలా కనబడదు. అట్లే మన విషయములో సాతాను క్రియలను అతని అనుచరుల క్రియలను ఈ విధముగా కనబడకుండా చేయును.

1 సాతాను క్రియలకు లయము.

2 శత్రువుల క్రియలకు లయము.

3 నా క్రియలకు లయము అని చెప్పవలెను. మన బలహీన క్రియలనుకూడ లయము చేయును. పాత నిబంధన ప్రజలకు ఇన్ని వాగ్దానములు లేవు, గాని మనకు గొప్ప వాగ్దానములు నెరవేర్పులు ఉన్నవి. కాబట్టి మనము పాత నిబంధన జనాంగముకంటే అన్ని విషయములలోను ఎక్కువగా స్తుతి ప్రార్థన చేయవలెను.

(25-11-45, St. దేవదాసు అయ్యగారి ఉపదేశము)