సీనాయి పర్వతానుభవములు
సీనాయి పర్వతానుభవములు
మోషే సుఖోపవాసముల ద్వారా కలుగవలసిన సమస్త మేళ్ళు దేవుడు మీకు అనుగ్రహించును
గాక!
ఇశ్రాయేలీయులు, దేవుడు ఏర్పాటు చేసికొన్న
జనాంగము. వారిని ఐగుప్తు దాస్యములోనుండి విడిపించి వాగ్దాన దేశమునకు నడిపించుటకు దేవుడు
మోషేను ఏర్పాటు చేసికొనెను. ఆ దైవజనుడైన మోషే దేవునియొక్క ప్రత్యక్షత గలవాడై ఇశ్రాయేలీయులను
దాస్యపు దేశమునుండి బయటకు నడిపించెను. ఆయన ఏర్పాటు చేసికొన్న తన ప్రజలకు దేవుడు తన్ను
తాను బయలుపరుచుకొనుటకు గాను, కట్టడలను, ఆజ్ఞలను న్యాయవిధులను వారికి ఇచ్చుటకు గాను,
వారిని సీనాయి పర్వతము యొద్దకు నడిపించెను. ఈ సీనాయి పర్వతమే ఒక ప్రత్యేక పర్వతము.
ఇచ్ఛట మోషేతో సహా ఇశ్రాయేలీయులందరూ కొన్ని ప్రత్యేకమైన అనుభవములు పొందిరి. అందుకొరకే
ఈ పర్వతము వారికి ప్రత్యేకమైన దైవ సహవాసానుభవము యిచ్చిన పర్వతము. అని చెప్పుకొనవచ్చును.
అట్టి సీనాయి పర్వతము యొద్ద ఎవరికి ఎట్టి అనుభవము కలిగెనో, వాటి వలన మనము నేర్చుకొనవలసిన
పాఠ మేమిటో వివరించవలెనను ఆశతో ఈ వ్యాసము వ్రాయుచున్నాను. సమస్తమును పరీక్షించి మేలైన
దానిని చేపట్టుడి I థెస్స 5.21 ప్రకారము అన్నిటిలోను ఏదో ఒక మంచి ఉండవచ్చునేమోగాని
సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుట అనునది చాలా అవసరమైయున్నది.
ఎన్నోరకముల వస్తువులు చూచిన తరువాతనే
మేలైన వస్తువులను ఎంచుకొన్నట్లుగా, ఆత్మీయ స్థితిగతులను సంపాదించుకొను విషయములో అలాగే
ఎంచుకొని సంపాదించుకొనవలెను ఈ పర్వతము యొద్దనున్న వారిని 3. గుంపులుగా మనము విభజించుకొనవచ్చును.
వీరిలో ఒక్కొక్కరిలో ఏదో ఒక ప్రత్యేకత లేకపోలేదు. ఆ ప్రత్యేకతను చూచి సంతోషించుట కాదుగాని
ఏది మేలైనదో ఎంచుకొనే వివేకము దేవుడు మన కనుగ్రహించారు. దైవజనుడైన దేవదాసు అయ్యగారు
ఒక చిన్న ఉదాహరణ చెప్పినారు. అది ఇప్పుడు నా మనస్సునకు వచ్చుచున్నది. అదేమనగా, స్వీట్లు,
పండ్లు, డబ్బు పెట్టి ఏది కావాలెనో తీసుకొনামంచే సాధారణముగా
అందరూ సొమ్మునే తీసుకొనే ప్రయత్నము చేస్తారు."అని విందులు గురించి చెప్పుచున్నప్పుడు
వ్రాయబడిన నోట్సులో నేను చదివినాను. అలాగే ప్రియమైన పెండ్లికుమార్తె సంఘమా! జాగ్రత్తగా
పరిశీలించండి
అంతస్థుల
లోని మురుపులు – సీనాయి కొలతలు
సీనాయి
పర్వతము యొద్ద ఉన్న 3 గుంపులు :
1) పర్వతము క్రింద ఉన్న ఇశ్రాయేలీయుల జనాంగము. నిర్గ
9 : 12, 13.
2) సీనాయి పర్వతముపైన దేవునికి దూరముగానున్న అహరోను,
నాదాబు, అబీహు, పెద్దలలో 70 మంది. నిర్గ 24 : 1.
3) సీనాయి పర్వత శిఖరము మీదనున్న మోషే. నిర్గ 19
: 20.
1)
మొదటి గుంపులో ఉన్న ప్రత్యేకతలు :
* వారు దేవుని జనాంగము, అబ్రహాము సంతానము.
* దేవుని బాహుబలముచేత దాస్యమునుండి విడిపింపబడినవారు.
* పస్కాను భుజించినవారు, ప్రత్యేకమైన మన్నాను భుజించినవారు.
* పస్కా గొర్రెపిల్ల యొక్క రక్త ముద్రచేత మరణమునుండి
తప్పింపబడినవారు.
* దేవుడుచేసిన అద్భుతములను. సూచక క్రియలను కన్నులారా
చూచినవారు.
* దేవుని మాటలు వినుటకును ఆయనను కలుసుకొనుటకును పరిశుద్ధపరచబడినవారు.
* దేవుని మాట వినియు బ్రతికిన వారు.
* ఇంకను అనేకమైన ప్రత్యేకతలు గలవు. వీటినన్నిటిని
మన నిజ జీవితములో సరిపోల్చుకొనవలెను.
2.
రెండవ గుంపులో ఉన్న ప్రత్యేకతలు :
* పై లక్షణములే
గాక వీరు మొదటి గుంపువారిలో నుండి ప్రత్యేకించబడినవారు.
* యాజకకార్యము
జరిగించుటకును, న్యాయము తీర్చుటకును మోషేపై యున్న దేవుని ఆత్మలో నుండి పాలుపొందినవారు.
* మిగతా ఇశ్రాయేలీయులకు
ఏర్పరిచిన మేరను దాటి, పర్వతము ఎక్కియు చావక బ్రతికినవారు.
* దేవునికి దూరముగా సాగిలపడినవారు.
* దేవుని చూచిన తరువాత అన్నపానములు పుచ్చుకొన్నవారు.
* దేవుని చూచియు ఏ హానియు పొందనివారు.
3.మూడవ
గుంపులో ఉన్న ప్రత్యేకతలు :
* వీరు మిగతా రెండు గుంపుల నుండి ప్రత్యేకించబడినవారు.
* దేవునిచే నాయకునిగా ఏర్పాటు చేయబడినవారు.
* దేవుని యొక్క ముఖాముఖి ప్రత్యక్షత గలవారు.
* దేవుని మహిమను వెనుక భాగము నుండి చూచినవారు.
* దేవుని మాటలు వింటూనే, తింటూనే 40 దినములు ఆయనను
చూచినవారు.
ఇట్టి లక్షణములు ఇంకనూ అనేకములుండును.
గనుక వాటిని మనము ఈ 3 గుంపులలో పై నుండి క్రిందకు పరిశీలించిన యెడల
* శిఖరానుభవములో ఉన్న మోషే.
* పర్వతానుభవములో ఉన్న 70 మంది పెద్దలు, మిగతావారు.
* మైదానానుభవములో ఉన్న మిగతా ఇశ్రాయేలీయులు.
సహవాసానుభవములో పరిశీలిస్తే : ఈ మూడు
గుంపుల స్థితి :
మొదటి
గుంపువారు : సామాన్య ప్రజానీకము యొద్దకు వెళ్ళి వీరి అనుభవము చెప్పిన యెడల, వారు
ఆశ్చర్యపోయే అనుభవము కలవారే. ఎందుకనగా వీరు దేవుడు మహా అగ్నితో దిగి వచ్చుట చూచి ఆయన
స్వరము వినియు బ్రతికినవారు. [సశేషము]
లక్షణమును వాని హృదయములలో అమర్చియున్నాడు.
అందువలననే మనుష్యులు నీతి, న్యాయములు మాట్లాడుచున్నారు. రాజ్యాంగము నీతిగలదిగాను, కోర్టు,
కచ్చేరీలు, నీతి న్యాయములు గలవై యుండవలెనని మానవులుకోరుట చూడగా నీతియను లక్షణమును తమలో
ఒకప్పుడు కలిగినవారై ఉన్నందుననే జడ్జి, లంచము తీసుకొని, నేరము చేసినవానిని దండించక
విడిచిన యెడల మన మనస్సు ఒప్పుకొనదు. మనలోని నీతియను లక్షణము దానికి విరోధముగా పొంగుచుండును.
దేవుని సృష్టియైన మానవునికి నీతియను లక్షణము యింతగా ఉంటే, సృష్టికర్తయైన దేవునికి యింకా
ఎంతగా ఉండునో... మనుష్యులలోని నీతి ఒక నీటి బొట్టు అయితే దేవుని నీతి సముద్రమంత ఉండవలెను
గదా! (సశేషము)
సీనాయి
పర్వతానుభవములు
దేవునితో
ఈ 3 గుంపులవారు కలిగియున్న సహవాసానుభవమును పరిశీలిస్తే వీరు ఎట్టి రీతిలో దైవ సహవాసము
కలిగియున్నారో తెలుసుకొనవచ్చును.
1)
మైదానానుభవము : పర్వతము క్రిందనుండి చూచిరి.
2)
పర్వతానుభవము : దూరమునుండి చూచి సాగిలపడిరి.
3)
శిఖరానుభవము : అతి సమీపములోను, ఆయన గాయములలోనుండి చూచిరి.
I
మైదానానుభవములో ఉన్న మిగతా ఇశ్రాయేలీయుల దైవ సహవాసానుభవము :
a) వీరు దేవుని
చూచుటకును, దేవుని స్వరము వినుటకును తమ్మును తాము పరిశుద్ధ పరచుకొన్న వారు అని ముందుగా
మనము తెలిసికొన్నాము. గాని దైవ సహవాసములో వీరు ఎక్కువ సమయము గడుపుటకు ఇష్టపడలేదు.
b) మోషే! నీవు
దేవునితో మాట్లాడి మాకు చెప్పుము, మేము దేవుని స్వరము వినినయెడల చనిపోవుదుము అని చెప్పినవీరు,
దేవుడే తాను సమీపముగా వచ్చుచున్నప్పటికిని ఆయనకు సమీపముగా వెళ్ళుటకు ఇష్టపడని స్థితిగలవారు.
c) వీరు ప్రత్యేకించబడిన
ప్రజలే, ఏర్పాటు జనాంగమే. కాని దైవ సహవాసముకంటే మోషే సహవాసమును కోరుచున్నవారు. నేటికాలమందు
క్రైస్తవులమని చెప్పుకొనుచూ “దేవుడు కనబడడు, మాట్లాడడు” అని చెప్పెడివారు, తాము ఏ స్థితియందు
నివసించుచున్నారో గమనించ వలసినదిగా విన్నవించుకొంటున్నాను.
d) 1) దేవుని
చూస్తే మేము బ్రతుక లేము అని ఇశ్రాయేలీయులు అన్నట్లుగానే నేటికాలపువారూకూడా దేవునిచూస్తే
మనము బ్రతుకలేము అనుచున్నారు, 2) మోషే నీవు మాట్లాడితేచాలు అన్నట్లు గానే వీరు కూడా
“బైబిలు” మాత్రమే చాలు అనుచున్నారు. మోషే గొప్పవాడే అలాగే బైబిలు గొప్పది. వీటికంటే
వీటిని కలుగ చేసిన దేవుడు గొప్పవాడుకాదా? ఆయన సహవాసము ఎందుకు కోరుకొనకూడదు?
e) దేవుడు చేసేమేళ్ళు
వీరికి కావలెనుగాని, దైవ సహవాసము వీరికి అవసరములేదు. మన్నాతిన్నారు, పూరేళ్లు తిన్నాగు,
ఎర్ర సముద్రము దాటినారు. ఇన్ని రీతులలో సహాయము చేసిన దేవుని చూచుటకు, ఆయన స్వరము వినుటకు
వీరికి యిష్టము కలుగలేదు. ఎందుకో?
f) దేవుడు వీరిమధ్య,
వీరితో ఉన్నారుగాని, వీరు దేవునిని వారి లోనికి ఆహ్వానించలేదు అని చెప్పవచ్చును. దేవుడు
వారిమధ్య కాపురముండెను. వారు ఆయన ప్రజలై యున్నారు. దేవుడే వారి దేవుడై యున్నారు. దేవుని
నివాసము మనుష్యులతో కూడా ఉన్నది ప్రక 21:3. ప్రకటనలోని ఈ అంతస్థు భూలోక మోక్షములోని
వారి అంతస్థు. అనగా ముప్పదంతలు గలవారి అంతస్థు.
గమనించండి...! ఇట్టి వారు ప్రత్యేకించబడినవారే
గాని, సంపూర్ణముగా ఎదిగినవారు కాదు. దేవుడు మీలో, మీరు దేవునిలో నివసించి ఫలింపవలెనని
పెండ్లికుమారుడు సెలవిచ్చుచున్నారు.యోహాను 15 : 5
II
పర్వతాను భవములో ఉన్న 70 మంది పెద్దలు, మిగతావారు :
* వీరు దేవుని
చూచుటకు ఇష్టపడినవారు. దేవునిచూచి దూరమున సాగిలపడిరి. అని మనము తెలుసు కొన్నాము. నిర్గ
24 : 2.
* దేవుని చూచుటకు
పర్వత మెక్కినారు గాని, శిఖర మెక్కలేదు. వీరికి కలిగిన దర్శనము కూడా దీర్ఘకాల మున్నది
కాదు గాని కొద్ది కాలమున్న దర్శనమే.
* వీరు ప్రవచించినపుడు
కూడా ఒక్కమారే ప్రవచించినారని; మరలా తర్వాత ప్రవచింపలేదని వాక్యమునుబట్టి తెలుసుకొనుచున్నాము.
సంఖ్య 11:25. యెహోవా ఆత్మలో పాలు ఆ 70 మంది మీద నిలిచెను. గనుక వీరు స్థిరమైన స్థితిని
అనగా ఎల్లప్పుడూ దేవుని చూచు స్థితికల్గినవారుకాదు గాని, ఒక్కసారి మాత్రమే వెలిగింపబడినవారు.
* ఇట్టివారు
నేటి కాల క్రైస్తవులయందుఉన్నారు. వీరు ఒక్కమారు వెలిగింపబడి అప్పుడు పొందిన స్థితిని,
అనుభవమును ప్రచారము చేసికొనుచు, అప్పటి ప్రభావముచేతనే కార్యములను చేయువారేగాని దేవుడు
అనుదినము మాకు ప్రత్యక్షమగుచున్నారు అని మాత్రము చెప్పలేరు.
* వీరు దేవుని
సన్నిధిలో స్థిరముగా కూర్చొని యుండలేదు గాని కొంచెముసేపు మాత్రమే దేవుని చూచే అనుభవమును
పొందినవారు.
* వీరు కూడా
ఇశ్రాయేలీయుల యొక్క పాపములో పాలు పంచుకొన్నవారే. వీరిని 60 వంతులు గుంపుగా చెప్పుకొనవచ్చును
మైదానములో వీరు లేరు గాని పర్వత మెక్కినారు. అలాగే ప్రక 7 : 9 వచనములోని గుంపును వీరికి
అన్వయించవచ్చును.
III
శిఖరానుభవములో ఉన్న మోషే :
* దేవునితో ముఖాముఖి
ప్రత్యక్షత కలిగిన గొప్ప ప్రవక్త. ఆయన సన్నిధిలో కూర్చుండి ఆయన చూపించినవన్నీ చూచి,
చెప్పినవన్నీ వ్రాసుకొని, దేవుని ముఖాముఖిగా చూచెను. ఆయన మహిమను చూడవలెనని కోరుకొని
దేవుని మహిమను చూచెను.
* దేవునితో నిత్య
సహవాసము కలిగియున్నాడు. ప్రతిదినము దేవుని నడిపింపు కలవాడు. ఇట్టి అనుభవము మనకు ఇవ్వవలెనని
మన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువు ఆశించుచున్నారు. అతనితో నేనును. నాతో కూడా
అతడును కలిసి భోజనము చేయుదుము. అని ప్రభువు సెలవిచ్చుచున్నారు. ప్రక 3:20. గనుక ఈ స్థితి
కలిగియుండుటకు ప్రయాసపడుడి.
* 80 దినములు
కేవలము దేవుని సహవాసములో, ఆయన మహిమలోఅన్న పానములు, సర్వకార్యములుమరచిగడిపినాడు. అందుచేత
మోషే ముఖమును ప్రకాశించినది. ఇట్టిస్థితి సంపాదించుకొనుటకొరకు ఈ 40 దినముల ఉపవాసములుచేయండి.
అందువలన మీకు మేలుకలుగును. మా తండ్రిగారైన రేవ. యస్. సమూయేలు బి. ఏ. గారి అనుభవముచెప్పి
ఈ వ్యాసము ముగిస్తాను. ఒకానొక దినమందు బి.ఏ. గారు ఒక బట్టల కొట్టులోనికి వెళ్లినారు.
అక్కడ వస్త్రములు కొనుటకు నిలువబడి యుండగా కొట్టులోనివారు అందరూ వారి పనులు మానుకొని
ఈ బి. ఏ. గారి వైపు తదేకముగా చూచుచున్నారు. బి. ఏ. గారికి ఈ విషయము తెలియక త్వరగా యివ్వండి
అని అడిగి త్వరగా, త్వరగా కొట్టులోనుండి బయటుకు వచ్చి వేసినారు. తరువాత ప్రభువు వచ్చి
అబ్బాయి ఈరోజు నన్ను నేను నీలోనుండి ఆ కొట్టులోనివారికి కనపరుచుకొన్నాను. అని చెప్పగా
అయ్యో, నేను ఇంతటి స్థితికి అర్హుడనా? అని బహుగా దుఃఖించినారట. ప్రియమైన పెండ్లికుమార్తె
సంఘమా! అంతకన్నా గొప్పస్థితి దేవుడు మనకు అనుగ్రహించగలరు. గనుక ఈ 40 దినములు ప్రభువుతో
ఏకమై యుండుటకు ఉపవాసములు చేయ్యండి.
“నేను నీలో నీవు నాలో లీనమైనట్టే అనుకొనుము
గాన ,నీకు లేనిదేది - పోనిదేది రానిదేది” ॥మనో॥
ఇట్టి స్థితి ప్రాణప్రియుడు మీకు అనుగ్రహించి తన రాకడలో మిమ్మును ఆయత్త పరచు
కొనునుగాక! ఆమెన్.
