Skip to main content

7 మెట్ల ప్రార్థన


అతి పరిశుద్ధ స్థలమందు ఆశీనుడైయున్న ప్రభువును చూచుటకై ఆయతిపరిశుద్ధస్థలములో ప్రవేశించు మార్గమును నేటి కాలమందు దేవదాసు అయ్యగారిద్వారా బోధింపబడి నేర్పింపబడినది. ఈ సాధనము అభ్యసించుటద్వారానే నేటి కాలమందు అనేకులు దైవ ప్రత్యక్షత పొందగలుగుచున్నారు. దీనికే మెట్ల ప్రార్థనయని పేరిడిరి. ఇందులో 7 మెట్లు గలవు. ఈ 7 మెట్ల ప్రకారం ధ్యానము చేయుటనే దైవసన్నిధి కూటమన్నారు.

1. మనో నిధానము : (Concentration of Mind) ప్రార్థన స్థలములో మోకరించి, లోక విషయములపై నున్న మనస్సును దేవునిపై కి మరలించుట. సమస్త విషయాలను మరచిపోవుట. ఫోటో తీయునప్పుడు శరీరము కదలకుండా కెమేరావైపు ఏలాగు తీక్షణంగా చూస్తామో అలాగే ప్రభువుపై దృష్టి నిలుపవలెను. దీనినే మరుపు మరుపుమెట్టుఅని యన్నారు. దా. కీ. 27.14 నందు దేవునిచూడ నపేక్షగలిగిన దావీదుకు దేవుడిచ్చిన ఆజ్ఞ, నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. ధైర్యము తెచ్చుకొనుము అని చెప్పగా, దా.కీ. 51:7నందు. దేవా నా హృదయము నిబ్బరముగా నున్నదియని దావీదు ప్రత్యుత్తరమిచ్చుచున్నాడు. గనుకనే బ్రతికి యుండగనే పరలోక, పాతాళలోకమందును దేవుని స్తుతించినాడు.

 2. పాపములొప్పుకొనుట : తన అతిక్రమములను (పాపములను) దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును. సామె. 28:13 గాన పాప క్షమాపణ పొందుటకుగాను ప్రతి వారు తమతమ పాపము లొప్పుకొనవలసియున్నది. ఆది. 12:1 ప్రకారం విడిచిపెట్టుట తేలికగాని దా.కీ. 45:10 ప్రకారం మరచిపోటం కష్టం. అనగా అనేకులు తమ పాపములను విడిచిపెట్టుచున్నారు అని విచారం. అజ్ఞాతి క్రమమే పాపము. సకల దుర్నీతియు పాపమే. విస్తారమైన పాపములుచేసి స్త్రీ విస్తారముగా పాపము తలంచి కన్నీరు కార్చినందున ఆమె ప్రభువు క్షమకు పాత్రురాలగుటయేగాక. ఈమెయొక్క మంచిర్యము చేసినదియని ప్రభువుద్వారా సాక్ష్యము పొందెనుగదా: “నీ విస్తార పాపములు క్షమింప బడినవి ఇట్టి పాపక్షమాపణ పొందుటకుగాను ప్రతి పాపమును ఆయన యెదుట కన్నీళ్లతో ఒప్పుకొనవలయును.

3. తీర్మానము : పాపములో పట్టబడిన స్త్రీని మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపుటకు యేసుయొద్దకు ఆమెనుతెగా. ఆమెతో ప్రభువు చక్కటి మాట పలికిరి. అదేమనగా. అమ్మా: నీవు చావకయుం డుట్లు మరలా పాపము చేయకుము, అంటే మరలా పాపంచేస్తే ఈసారి చావు తప్పదు. వెనువెంటనే ఆ స్త్రీ తన మనస్సులో ఒక తీర్మానముచేసు కొన్నది. అవును నేను కావకయుండునట్లు మరల పాపము చేయను. అలాగే పాపపశ్చాత్తాపపడు ప్రతివారు మరలా ఆ పాపమువైపు చూడకుం డునట్లు, చేయకుండునట్లు ఒక తీర్మానమును ప్రభువుయెదుట చేయవలెను.

4. సమర్పణ : దేవునిద్వారా కలిగియున్న సమస్తము ఆయనకు సమర్పించుకొనుట. మీ దేహములను దేవునికి సజీవ యాగముగా సమ ర్పించుకొనుడి, అని చెప్పబడినట్లు. శరీరము, ప్రాణము, ఆత్మ, విద్య, ఉద్యోగము మొదలగు సమస్తము ఆయనయందు, ఆయనద్వారా సంపూర్ణ ముగా కాపాడబడునట్లు ఆయనకు సమర్పించుకొనవలయును.(1 థెస్స 5:23) ఇట్లు సమర్పణపరుల ఆత్మ, శరీరము, జీవము ప్రభువుయొక్క రెండవ రాకడ వరకు కాపాడబడును.

5. స్తుతి : 1 థెస్స 5:16–18 ప్రకారం ప్రతి విషయమునందును కృతజ్ఞతా స్తుతులు చెల్లించుట. 1.అనగా కీడులు, అపాయములు, తొలగించినం దుకు 2.మేలు కలిగించినందుకు ప్రభువును స్తుతించుట. ప్రార్థనకన్న స్తుతి గొప్పది. స్తుతి యాగము (యజ్ఞము) చేయువాడు ధన్యుడను వేదవాక్య ప్రకారం స్తుతి గొప్పది, మనిషియొక్క మతి (మనస్సు వచ్చును. స్తుతినిబట్టి స్థితి కలుగును, స్థితినిబట్టి నీ పరలోకపు గతి యుం డును. (1. మతి, 2. స్తుతి, 3. స్థితి, 4. గతి)

6. ప్రార్థన: ఎడతెగక, విసుగక, అత్యాశక్తితో, బహుగా నిత్యము ప్రార్థన చేయవలెను. ఎడతెగక ప్రార్థన చేసిన 120 మంది మేడ గదిలో పరిశుద్ధాత్మను పొందిరి. అనగా వాగ్దానఫలము అనుభవించిరి. అ.కా. 1:14 ,అత్యాశక్తితో ప్రార్థించిన సంఘము చెరసాలయందున్న తమ నాయకుని (పేతురును) విడిపించుకొనగలిగిరి. అ. కా. 12:5-7; విసుగక ప్రార్థించిన స్త్రీ (గోజలాడిన స్త్రీ) న్యాయపు తీర్పు నొందగలిగినది. బహు వ్యాకుల ముతో ప్రార్థించిన ప్రభువు దేవదూతచేత బలపరచబడెను. లూకా. 23:42-43. ఈలాగున ప్రార్థనఫల మందుకొనువరకు ప్రార్థించుట విశ్వాసి విధియైయున్నది. ముఖ్యముగా దేవా! నాకు కనబడుము నాతో మాట్లా డుము. ఆమేన్ అని ప్రార్థించి స్తుతింపవలయును.

7. కనిపెట్టుట : మొదటి మెట్టునందు ఎంతటి మనో నిధానము కలిగియుంటిమో అదే మనో నిధానము కలిగి మౌనముగా ప్రభువు ప్రత్యక్షత దైవ చిత్తముకొరకు కనిపెట్ట వలయును.** రూతు 3వ అధ్యాయంలో అత్త యైన నయోమి రూతునకు చేసిన ఉపదేశములో 3:4 అతని పాదములయొద్ద మౌనముగా పండుకొనియుండుము. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయును. మౌనంగా దేవునియెదుట మోషే ఉన్నారు గనుక దేవుడు పని చేసారు. పలకలుచేసి, వ్రాతవ్రాసి మోషేకు చూపి బోధించినారు. ప్రవక్తయగు ఏలియా హోరేబు పర్వత శిఖరమునగల యొక గుహలో మౌనంగా యున్నప్పుడు గుహ ద్వారముదగ్గర మెల్లని స్వరముతో దేవుడు పిలిచి ఆయన చేయవలసినదేమిటో తేటగా తెలియపరచినారు. అందుకే దా.కీ. 27:14లో యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము. జఫన్యా 1:8లో యెహోవా సన్నిధిని మౌనముగా కనిపెట్టుకొని యుండుము అని ఈలాగు అనేకానేక సందర్భములు గలవు. కనిపెట్టుటద్వారా కలుగు ప్రయోజనములు ఎన్నియో గలవు (The Benefits of Meditation in the presence of God) అను దేవదాసు అయ్యగారిచే ప్రచురితమైన ఇంగ్లీషు పత్రికలో మరిన్ని చేర్చుకొనగలము. గనుక ప్రార్థనానంతరమున మౌనముగా కొంత సమయము కనిపెట్టవలయును.

ఇంతవరకూ చెప్పబడిన ఈ 7 మెట్లు చొప్పున ప్రార్థించినట్లయిన ప్రభువుయొక్క ప్రత్యక్షతను పొందగలము, మరియు 1. శరీరశుద్ధి, 2. వస్త్ర శుద్ధి, 3. హృదయ శుద్ధి, 4. వాక్కు శుద్ధి, 5. మతి శుద్ధి, 6. పాద శుద్ధి, 7. స్థలము శుద్ధి ఈ ఏడు శుద్ధులూ కలిగి ఎవరు దైవ సన్నిధి చేయుదురో వారు త్వరగా ప్రభువును చూడగలరు. త్వరగా ప్రభువుతో మాట్లాడగలరు అని దైవ జనుని ఉపదేశమైయున్నది. ఈ పద్ధతియే దేవుని దర్శించుటకు అతి పరిశుద్ధ స్థలముతో ప్రవేశించు మార్గమై యున్నది గాన ,

ప్రియ చదువరీ మీరు నన్ను వెదకినయెడల, పూర్ణ మనస్సుతో నన్నుగూర్చి విచారణ చేసిన యెడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనబరచుకొందును. యిర్మి 29:13 లో లిఖితమైయున్నట్లు, ఆయనను వెదకుట మన పని. మనకు కనబడుట ఆయన పనియైయున్నది. దైవ దర్శనము పొందుటకింత సులువైన సాధనముండగా దేవుడు దూతలు పరలోకవాసులు కనబడరు. మాట్లాడరు అని వాధింపనేల బాధనొందనేల? పూర్వదినములయందు దేవుడు నానా విధములుగా తన ప్రవక్తలద్వారా మాట్లాడి నట్లు నేడును మనతో మాట్లాడును అట్టి స్థిత్యనుభవము పొంది రాకడవరకు కాపాడుకొనునట్లు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచూ విడువక నీ యెడల కృప చూపుచున్న దేవుడే (యిర్మి 31:3) ఒక్కొక్కరిని ఆదరించునుగాక!

Comments

Popular posts from this blog

దైవలక్షణముల స్తుతి (సంఘారాధనలోని స్తుతులు)

అనాది :- అనాది దేవా! సృష్టింపబడకుండ నీ యంతట నీవే ఉన్నావు , గనుక నీవు ముందే ఉండి , మా చరిత్ర అంతటిని చూచుచు మాకు కావలసినవన్నియు ముందే ఏర్పాటు చేసియున్నావు. గనుక నీకు మా వందనములు. అనంతము :- అనంత దేవా! నీవు ఎల్లప్పుడు ఉండువాడవు గనుక అంతములేని కాలము వరకు కావలసినవన్నియు మేము అనుభవించుటకై నీ అనంత సన్నిధిని మా కొరకై ఉంచిన నీకు స్తుతులు. ప్రేమ :- ప్రేమవైయున్న తండ్రీ! నీవు ముగ్గురుగా (త్రిత్వముగా) బయలు పడకపోయిన , మేము నిన్ను ప్రేమించుట ఉండదు. నీ ప్రేమ సృష్టి యంతటిలోను కనబడుచున్నది. మేము మా పిల్లలను ప్రేమించుటకన్న నీవు మమ్మును ప్రేమించుటయే ఎక్కువైయున్నది. మమ్మును కలుగజే సిన నీవు మమ్మును ప్రేమించక యింకేమి చేయుదువు! గనుక నీ ప్రేమను బట్టియే మానవునికి కావలసినవన్నియు ఆలోచించి చేసినావు. ఆ నీ ప్రేమనుబట్టియే సహించుచు , శిక్షించుచు , క్షమించుచున్నావు. మరియు అట్టి నీ ప్రేమను బట్టియే మా పాపములను జ్ఞాపకము చేసికొనను అన్నావు. గనుక నీకు వందనములు. పరిశుద్ధత :- పరిశుద్ధుడవైన జనకా! సర్వసృష్టిని , మానవుని , పరిశుద్ధముగానే చేసియున్నావు. పాపప్రవేశమును బట్టి మేము పాపులమైనను , నీ పరిశుద్ధతను బట్టి మరల మాకు పరి...

దైవలక్షణముల స్తుతి (సమర్పణ ప్రార్ధనలోని స్తుతులు)

  1. దేవా , తండ్రీ! నా నిమిత్తమై సమస్తమును కలుగజేసిన తండ్రీ! అనుదినము మాకు కావలసినవన్నియు అందించుచున్న తండ్రీ! నా ప్రియుడవైన తండ్రీ! నా దేవా , నా ప్రభువా! పోషకుడా , నా రక్షకుడా , నా సర్వమా! నీ కనేక నమస్కారములు. తండ్రీ! సృష్టి మూలముగ మాత్రమేగాక , నీ కుమారుని మూలముగ కూడ నన్ను నీ బిడ్డగా ఏర్పరచు కొన్నందులకై నీ కనేక వందనములు. నీ దానముల మూలముగాను , నీ సహింపు మూలముగాను , నీ నడిపింపు మూలముగాను , మా కష్టములు నివారణ చేయు నీ క్రియల మూలముగాను , నాకు నీవు చూపుచున్న ప్రేమను త లంచుకొని నిన్ను స్తుతించుచున్నాను. గాని నా స్తుతి నీ ప్రేమ యెదుట యేమాత్రము ? నా అంతరంగమందున్న కృతజ్ఞత నీ అనంత ప్రేమ యెదుట యేమాత్రము ? నేను ఏదియు ముట్టుకొనక స్తుతి మాత్రమే చేసినను అది సహితము నీ కనికరము యెదుట మిక్కిలి స్వల్పమై ఉండును. ఆ స్వల్ప స్తుతులను కూడ హస్తార్పణముగ అందుకొనుచున్నావు. గనుక నీకు వందనములు. నీవు నన్ను నేటివరకు కాపాడుచు , నడిపించుచు , వృద్ధిలోనికి తీసికొనివచ్చుచున్న నీ శక్తిని తలంచుకొని స్తుతించుచు , యిక ముందునకు కూడ నా విషయములో యిట్టి కార్యములు చేయుచుందువని నమ్ముచు నిన్ను స్తుతించుచున్నాను. నా జీవితాంతమందు ...

రెండు ద్వారములు, మత్తయి 6:33 - (యం. దేవదాసు అయ్యగారి ఉపదేశము.) తేది 12 — 10 — 1958

రెండు ద్వారములబడి దేవుని రాజ్యములోనికి, దేవుని సంఘము లోనికి రావలసినవారికి ఈ వాక్యమందు వర్తమానమున్నది. మన దేవాలయమునకున్నది ఒక ద్వారము. ఇక్కడ నిండి పోయినందువల్ల ఒక్కొక్క ఆదివారము వెనుక ద్వారము గుండా వచ్చి ఇక్కడ కూర్చుని వింటారు. వారుకూడా ఆరాధనలో పాల్గొంటారు. ఈ వాక్యమును విడదీసికొందాము. అందులో రెండు గొప్ప మాటలు ఉన్నాయి. (1) దేవుని రాజ్యము (2) ఆయన యొక్క నీతి దేవునియొక్క రాజ్యముగా దేవునియొక్క గవర్నమెంటు. ఈ గవర్నమెంటుకు ఆయనే రాజు. అయితే దేవుని రాజ్యమెక్కడ ఉన్నది ? మన హిందూ దేశము నేలే గవర్నమెంటు. రాజ్యము ఢిల్లీలో ఉన్నది. వారి రాజ్య ప్రవేశము హిమాలయమునుండి కన్యాకుమారి వరకు ఉన్నది. అలాగుననే దేవుని రాజ్యముకూడా నున్నది. ఇంగ్లండు దేశము వారికి వారి దేశమే వారి రాజ్యము. వారు ఇతర దేశములు కూడా గెలుచుకుంటే అది కూడా వారి రాజ్యమే. అలాగే జపాను వారున్నది జపాన్ రాజ్యము వారెక్కడైనా గెలుచుకుంటే అది వారి రాజ్యమే. అలాగుననే దేవునిరాజ్య మెక్కడ నున్నది ? అనేది ఒక గొప్ప ప్రశ్న. ప్రభువు 1. ఆయన రాజ్యమును వెదకమన్నారు. రాజ్య మెక్కడనున్నదో తెలియకపోతే ఎలాగు? ఎక్కడున్నదో చెప్పే వెనుకనున్నారు. మత్తయి 6 అధ్యాయములో...