Skip to main content

సంస్కార పాఠము - దైవజనుడైన యం. దేవదాసు అయ్యగారి ఉపదేశము


తండ్రి : లూకా 26:6
  కుమార : మార్కు 14:12-16 ; పరి : 1 కొరి : 11:23-34

సంస్కార భోజనమును గూర్చిన బోధ వినుటకు, సంస్కార భోజనము గైకొనుటకు వచ్చిన ప్రియ విశ్వాసులారా! మీరందరకు ఈ రెండు విషయములలో శుభకరమైన ఆహ్వానమందును గాక! ఆమేన్.

మొదటిది ఉపన్యాసము, రెండవది ప్రభుభోజనము. ఈ రెండూ ముఖ్యమైనవే. ఉపన్యాసములు అనేక పర్యాయములు విన్నా ఉపన్యాసమే. సంస్కార భోజనము అనేక పర్యాయములు తిన్నా భోజనమే. ఈ రెండూ అవసరమే అని గుర్తించండి.

భోజనము, భోజనము, భోజనము, భోజనములనే భోజనములు, నాలుగు రకములు. ఈ నాలుగు భోజనముల విషయములు మనకు తెలిసినవేగాని కొద్దిగా జ్ఞాపకము చేస్తాను.

మొదటి భోజనము : దేవుడు మనకు అనుదినము యిచ్చే భోజనము. ఏమి తిందుమో? ఏమి త్రాగుదుమో, ఏమి ధరింతుమో అని చింతించవద్దు, అని ప్రభువు చెప్పెను. గనుక ఆయన అనుదిన ఆహారమిచ్చేవాడు. పక్షులకే యిచ్చుచుండగా వాటికంటే శ్రేష్టమైన స్థితిలోనున్న మనకెందుకు యివ్వడు. మనము ప్రతి దినము భోజనము తినేటప్పుడు ప్రార్థించాలి. స్తుతించాలి. "స్తుతించి మనలను ఆహారముతో సంతోష పెట్టిన తండ్రిని మనము సంతోష పెట్టాలి" దేవుడు మనకు అనుదినము యిస్తున్న ఆహారము ముఖ్యమైనదే. ఈ ఆహారమువలన 1) ఆరోగ్యము 2) రోగ నివారణ 3) ఆయుష్షు 4) దేహానికి కళ. ఈ నాలుగు, పై భోజనము వలన మనకు కల్గుచున్నవి. గాన ఈ ఆహారము ఎంతో ముఖ్యము. ఈ నాలుగు అక్కరలేని వారుందురా ? లేరు. నేలపైగాని, చాపపైగాని, బల్లపైగాని కూర్చుండి ఆకులలోగాని, ప్లేటులలోగాని తినే ఈ ఆహారము 'వద్దు' అనేవారుందురా ? ఉండరు. ప్రతి దినము భోజనము ఎలాగు తప్పదో అలాగే ప్రతి దినము స్తుతి తప్పదు. అట్లు స్తుతించిన; తండ్రికి మహిమ, మనకు తృప్తి, సంతోషము.

రెండవ భోజనము : మొదటి దానికంటే ముఖ్యము. మొదటి భోజనము శరీరములోని ప్రాణానికిని, రక్తానికిని ముఖ్యము. శరీరము లోని ఇతర అవయవము లన్నిటికిని చర్మమునకు మాత్రమే ఈ భోజ నము అవసరము. అయితే దైవగ్రంథములోని భోజనము గొప్పది. అది శరీరాహారము. ఇది ఆత్మాహారము. ఇది వాక్యాహారము. అది పదార్గాహారం. పదార్థ ఆహారము కంటే వాక్యాహారము చాలా గొప్పది. మొదటి ఆహారము తిన్నప్పుడు ఆకలి తీరినట్లు, వాక్యము చదువగా, తృప్తికలిగి ఆకలి తీరాలి. ఒక పాపి దైవ గ్రంథము తీసి చదువగా ఆహారము తినునప్పటికంటే; వాక్యము చదువు నప్పటి సంతోషము గొప్పదిగా ఉండును. అందుకనే కొందరు 12 గంటలైనా, భోజనానికి పిలిచినా, చదువుతూ, వస్తాను అంటారు. గాన ఈ ఆహారము చాలా గొప్పది. దీనిలో గొప్పతన మేమనగా ఈ నాలుగు భోజనము విషయము ఇందు ఉన్నది గాన గొప్పది. ఇదే లేకపోయిన మొదటి భోజనము తిన్నా దాని విలువ తెలియదు. తక్కిన మూడు భోజనము విషయము తెలియదు. మొదటి భోజనము వలన వచ్చుచున్న నాలుగు మేళ్ళు ఈ భోజనము వలనకూడా కల్గును.

ఈ రెండవ భోజనము వలన కలుగుచున్న మేళ్లు ఏవనగా, 1. పాప పరిహారం, 2. పాపరోగ పరిహారం, 3. ఇది చదువగానే ఎక్కడ లేని ఉద్రేకము కలుగును, 4. ఆయుష్కాలము కలుగును. వాక్య భోజనము యొద్ద మొదటి భోజనములో లేని పదార్థములు ఉన్నవి. దేవుని వాక్కు వలన పాపహరణ, ఆరోగ్యమార్గం, ఆయుష్కాల మార్గము, సంతుష్టి మార్గము ఉన్నది. (బైబిలు మిషను - స్వరము)

మూడవ భోజనము : సంస్కార భోజనము : ఇది శరీరానికి ఆత్మకు రెంటికి సంబంధించినదే. మొదటి భోజనము ఎక్కువగా శరీరానికే. సంస్కారము ఎక్కువగా ఆత్మకు. పై రెండు భోజనములలో ఉన్న నాలుగు లక్షణములు ఈ భోజనములోకూడా నున్నవి. అంతేగాక ఈ భోజనమువలన ఆత్మకు కళ కలుగుచున్నది.

మొదటి భోజనములో అన్నము, కూర, నీళ్లు, పాలు, పండ్లు ఉన్నవి. రెండవ భోజనములో మొదటి దానిలో లేని పదార్థములు ఉన్నవి. మూడవ భోజనములో ఏకముగా ప్రభుని శరీర రక్తములే యున్నవి.

మొదటి భోజనముకంటే మిగతా రెండూ : 1. శ్రేష్టమైనవి 2. గొప్పవి. ఇవి ఇలాంటివి అని చెప్ప వీలులేదు. ఒక దానికంటె మరొకటి గొప్పగా చేసిన తండ్రి ఎంత గొప్పవాడో.

మొదటి భోజనము సృష్టిలోని భోజనమే, రెండవ భోజనము వాక్కులో ఉన్న భోజనమే . అయితే మొదటిది రెండవది కలుగచేసిన ఆయనే మూడవ భోజనము అయి ఉన్నారు. "అది అనుభవించుట మన పని."

ఏదికూడ అయోగ్యముగా పుచ్చుకొనకూడదుగాని, దేవుడు అయోగ్యులకు మొదటి భోజనము, రెండవ భోజనము, మూడవ భోజనము యిచ్చుచునే యున్నారు. ఈ మూడవ భోజనము యొద్దకు అయోగ్యముగా వస్తే రావద్దు అని దేవుడు చెప్పవలసినదేగాని ఆయన ఆలాగు అనుటలేదు.

జీర్ణమో, అజీర్ణమోగాని మొదటి భోజనము యొద్దకు వచ్చి తినవచ్చును. వచ్చి తినుటకు శక్తి ఉన్నది. అలాగే రెండవ భోజనము యొద్దకును గ్రంథ భోజనము వద్దకును రాగలరు. అలాగే క్రైస్తవులు ఈ సంస్కార భోజనము యొద్దకు కాళ్ళతో నడిచి వస్తారు. అయోగ్యులను “పుచ్చుకొనవద్దు అని దేవుడు చెప్పడు గాని అయోగ్యముగా రావద్దు అని ముందే వ్రాసినారు గనుక మనము అయోగ్యముగా భోజనము యొద్దకు వెళ్ళకూడదు.

ఆయన నావద్దకు వచ్చువానిని నేనెంత మాత్రము త్రోసివేయను అన్నారు గాన త్రోసివేయడుగాని ఫలితము తరువాత ఉన్నది. మొదటిది, రెండవది, మూడవది మామూలు భోజనములే.

నాలుగవ భోజనము : పరలోకములో 'రేపు' అనగా త్వరగా అని అర్థము, పెండ్లి విందు పరలోకములో జరుగనై యున్నది. మొదటి భోజనమువలెగాదు- రెండవ భోజనమువలెగాదు- మూడవ భోజనమువలెగాదు- వీటిని అయోగ్యముగా తీసికొన్నట్లు ఈవిందు తీసికొనలేము. ఎందుకనగా ఇది పరలోకములో జరుగుచున్న విందు. ఈవిందు యొద్దకు అయోగ్యుడా నీవు రావద్దు అని ప్రభువు చెప్పడుగాని పరలోక ప్రవేశార్హత లేనందున ఈమనిషి వెళ్ళలేడు. ఎందుకు? మొదటి మూడు భోజనాలు, భోజనాలే గాని ఇది 'విందు' అని బైబిలులో వ్రాయబడియున్నది. ఈవిందు ఎందులో ఎక్కువ అంటే 1. రావద్దు అని చెప్పడు. కాని మనిషి రాలేడు. అందుకని అది ఎక్కువ. 2 యోగ్యులే వెళ్ళాలి. 3. ఇంకొక దానిలో మహా ఎక్కువ. పెండ్లి విందువంటి విందు. అందుకని ఎక్కువ. 4. దేవుని లక్షణాలేవో అవి స్పష్టముగా చూస్తూ ఆనందిస్తూ ఉంటాము. ఆ లక్షణాలు చూస్తూ అనుభవిస్తూ ఉంటాము. ఇక్కడే దేవుని లక్షణములు తెలుసుకొంటాము. అక్కడ ఇంకా తెలుసుకొంటాము. అనుభవిస్తాము.

దేవుని లక్షణములు మొదటి మూడు భోజనములయొద్ద అనుభ విస్తాము కాని ఇక్కడ యింకా అనుభవిస్తాము. దాని పేరే విందు. దేవదాసు అయ్యగారు కొద్దిగా అనుభవించినారు గాని వర్ణింప లేదు. నాలుగవది గొప్పది. మొదటి మూడూ సరిగా అనుభవించనిదే ఇది దొరకదు. ఇదెప్పుడు దొరుకుననగా మొదటి మూడు భోజనము లలో ఉన్న అయోగ్యత తీసి వేసుకున్న నాడే.

ఈ విందు ఎవరిది?

1. పరలోక విందు, పెండ్లి కుమార్తె సంఘ విందు

 2. పెండ్లి కుమారుడని బిరుదు పొందిన యేసు క్రీస్తు విందు.

 3. తండ్రి సిద్ధపరచిన విందు

 4. పరిశుద్ధాత్మ తండ్రి భూలోకములో ఎవరిని పెండ్లి కుమార్తెగా సిద్ధపరచునో వారిదే ఆ విందు

 5. ముగ్గురు (త్రిత్వము) ఉన్న విందు గాన గొప్ప విందు.

ముగ్గురు కన్పించుచుందురు. 6. ఆవిందు నీకుకావాలనినా గొప్పగా సిద్ధపడుము. ఆవిందు గొప్పతనము వివరించిన ఆ విందులో కూర్చోవాలనే భ్రమ కలుగును.

ఉదా: ఒక పళ్ళెములో పండ్లు, ఒక పళ్ళెములో మిఠాయి, ఒకదానిలో 'రూపాయలు' పెట్టిన మొదటి రెండు చూడక మూడవ దానికొరకు చెయ్యిచాపును. అతనికి దొరకదుగాని భ్రమ. అలాగే పరలోక విందు కావాలన్నా వారు తమ 'అయోగ్యత' తీసివేసికొనిన ఈ విందు అందును. పరలోకమునకు వెళ్ళేవారు పెండ్లి కుమార్తె ఒక్కరే. అలాగే గొప్ప అంతస్తుకు సిద్ధపడిన వారే అందులో ఉందురు. వారే పెండ్లి కుమార్తె. 1 కొరింథి 15 అధ్యాయము, ప్రకటనలో, మత్తయి 13 అధ్యాయములలో పెండ్లి కుమార్తెను గూర్చి ఉన్నది. అయితే పెండ్లి కుమార్తె పరలోకమునకు వెళ్ళి విందులో కూర్చొని పెండ్లి కుమార్తె వరుసలో లేని భక్తులను ఈమె పిలుచుకొనును. వారు రక్షణలోని వారే అనేక స్థలాలనుండి పంక్తులు, పంక్తులుగా వచ్చి 7 సం||లు భోజనము చేయుదురు. తరువాత వారు తమ స్థలములకు వెళ్తారు. పెండ్లి కుమార్తె శాశ్వతకాలముండును. ఈమె ఉండే ప్రదేశము వేరు, మహిమ వేరు. రక్షితులు ఆ స్థలములో శాశ్వతకాల ముండరు. అర్హతలేదు. కాబట్టి మీ ప్రవర్తన, మీ సిద్ధపాటు, మీ యోగ్యతా, మీ స్తుతి, మీ ప్రార్థననుబట్టి పెండ్లి కుమార్తెగా సిద్ధపడండి. మీ అయోగ్యతను వెనుక విడిచిపెట్టి ప్రభువిచ్చు శరీర రక్తములు పుచ్చుకొని ఆయనను సంతోషపెట్టి మేలు పొందండి. లోతు భార్యవలె వెనుకకు తిరిగి మీ యోగ్యతవై పు చూడక బల్ల యొద్దకు రండి. ఈ కొద్ది మాటలు మీకు మేలుగా అందును గాక! ఆమేన్.

Comments

Popular posts from this blog

దైవలక్షణముల స్తుతి (సంఘారాధనలోని స్తుతులు)

అనాది :- అనాది దేవా! సృష్టింపబడకుండ నీ యంతట నీవే ఉన్నావు , గనుక నీవు ముందే ఉండి , మా చరిత్ర అంతటిని చూచుచు మాకు కావలసినవన్నియు ముందే ఏర్పాటు చేసియున్నావు. గనుక నీకు మా వందనములు. అనంతము :- అనంత దేవా! నీవు ఎల్లప్పుడు ఉండువాడవు గనుక అంతములేని కాలము వరకు కావలసినవన్నియు మేము అనుభవించుటకై నీ అనంత సన్నిధిని మా కొరకై ఉంచిన నీకు స్తుతులు. ప్రేమ :- ప్రేమవైయున్న తండ్రీ! నీవు ముగ్గురుగా (త్రిత్వముగా) బయలు పడకపోయిన , మేము నిన్ను ప్రేమించుట ఉండదు. నీ ప్రేమ సృష్టి యంతటిలోను కనబడుచున్నది. మేము మా పిల్లలను ప్రేమించుటకన్న నీవు మమ్మును ప్రేమించుటయే ఎక్కువైయున్నది. మమ్మును కలుగజే సిన నీవు మమ్మును ప్రేమించక యింకేమి చేయుదువు! గనుక నీ ప్రేమను బట్టియే మానవునికి కావలసినవన్నియు ఆలోచించి చేసినావు. ఆ నీ ప్రేమనుబట్టియే సహించుచు , శిక్షించుచు , క్షమించుచున్నావు. మరియు అట్టి నీ ప్రేమను బట్టియే మా పాపములను జ్ఞాపకము చేసికొనను అన్నావు. గనుక నీకు వందనములు. పరిశుద్ధత :- పరిశుద్ధుడవైన జనకా! సర్వసృష్టిని , మానవుని , పరిశుద్ధముగానే చేసియున్నావు. పాపప్రవేశమును బట్టి మేము పాపులమైనను , నీ పరిశుద్ధతను బట్టి మరల మాకు పరి...

దైవలక్షణముల స్తుతి (సమర్పణ ప్రార్ధనలోని స్తుతులు)

  1. దేవా , తండ్రీ! నా నిమిత్తమై సమస్తమును కలుగజేసిన తండ్రీ! అనుదినము మాకు కావలసినవన్నియు అందించుచున్న తండ్రీ! నా ప్రియుడవైన తండ్రీ! నా దేవా , నా ప్రభువా! పోషకుడా , నా రక్షకుడా , నా సర్వమా! నీ కనేక నమస్కారములు. తండ్రీ! సృష్టి మూలముగ మాత్రమేగాక , నీ కుమారుని మూలముగ కూడ నన్ను నీ బిడ్డగా ఏర్పరచు కొన్నందులకై నీ కనేక వందనములు. నీ దానముల మూలముగాను , నీ సహింపు మూలముగాను , నీ నడిపింపు మూలముగాను , మా కష్టములు నివారణ చేయు నీ క్రియల మూలముగాను , నాకు నీవు చూపుచున్న ప్రేమను త లంచుకొని నిన్ను స్తుతించుచున్నాను. గాని నా స్తుతి నీ ప్రేమ యెదుట యేమాత్రము ? నా అంతరంగమందున్న కృతజ్ఞత నీ అనంత ప్రేమ యెదుట యేమాత్రము ? నేను ఏదియు ముట్టుకొనక స్తుతి మాత్రమే చేసినను అది సహితము నీ కనికరము యెదుట మిక్కిలి స్వల్పమై ఉండును. ఆ స్వల్ప స్తుతులను కూడ హస్తార్పణముగ అందుకొనుచున్నావు. గనుక నీకు వందనములు. నీవు నన్ను నేటివరకు కాపాడుచు , నడిపించుచు , వృద్ధిలోనికి తీసికొనివచ్చుచున్న నీ శక్తిని తలంచుకొని స్తుతించుచు , యిక ముందునకు కూడ నా విషయములో యిట్టి కార్యములు చేయుచుందువని నమ్ముచు నిన్ను స్తుతించుచున్నాను. నా జీవితాంతమందు ...

రెండు ద్వారములు, మత్తయి 6:33 - (యం. దేవదాసు అయ్యగారి ఉపదేశము.) తేది 12 — 10 — 1958

రెండు ద్వారములబడి దేవుని రాజ్యములోనికి, దేవుని సంఘము లోనికి రావలసినవారికి ఈ వాక్యమందు వర్తమానమున్నది. మన దేవాలయమునకున్నది ఒక ద్వారము. ఇక్కడ నిండి పోయినందువల్ల ఒక్కొక్క ఆదివారము వెనుక ద్వారము గుండా వచ్చి ఇక్కడ కూర్చుని వింటారు. వారుకూడా ఆరాధనలో పాల్గొంటారు. ఈ వాక్యమును విడదీసికొందాము. అందులో రెండు గొప్ప మాటలు ఉన్నాయి. (1) దేవుని రాజ్యము (2) ఆయన యొక్క నీతి దేవునియొక్క రాజ్యముగా దేవునియొక్క గవర్నమెంటు. ఈ గవర్నమెంటుకు ఆయనే రాజు. అయితే దేవుని రాజ్యమెక్కడ ఉన్నది ? మన హిందూ దేశము నేలే గవర్నమెంటు. రాజ్యము ఢిల్లీలో ఉన్నది. వారి రాజ్య ప్రవేశము హిమాలయమునుండి కన్యాకుమారి వరకు ఉన్నది. అలాగుననే దేవుని రాజ్యముకూడా నున్నది. ఇంగ్లండు దేశము వారికి వారి దేశమే వారి రాజ్యము. వారు ఇతర దేశములు కూడా గెలుచుకుంటే అది కూడా వారి రాజ్యమే. అలాగే జపాను వారున్నది జపాన్ రాజ్యము వారెక్కడైనా గెలుచుకుంటే అది వారి రాజ్యమే. అలాగుననే దేవునిరాజ్య మెక్కడ నున్నది ? అనేది ఒక గొప్ప ప్రశ్న. ప్రభువు 1. ఆయన రాజ్యమును వెదకమన్నారు. రాజ్య మెక్కడనున్నదో తెలియకపోతే ఎలాగు? ఎక్కడున్నదో చెప్పే వెనుకనున్నారు. మత్తయి 6 అధ్యాయములో...